బాహుబలి 2 గురించి సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ ఏమన్నారంటే ?
- May 1, 2017 / 07:29 AM ISTByFilmy Focus
వెండితెరపై రాజమౌళి గీసిన అద్భుత చిత్రం బాహుబలి 2 ని ప్రేక్షకులతో పాటు స్టార్ డైరక్టర్లు, స్టార్ హీరోలు సైతం అభినందనలతో ముంచెత్తుతున్నారు. టాలీవుడ్ కి చెందిన వారే కాకుండా కోలీవుడ్ కి చెందిన వారు కూడా ప్రభాస్ నటనను, రాజమౌళి ప్రతిభని ప్రశంసిస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ చేరారు. శంకర్ దర్శకత్వంలో 2 .0 షూటింగ్ లో బిజీగా ఉన్న ఈయన నిన్న సినిమాని చూసి ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. బాహుబలి-2 భారతీయ సినిమాకు గర్వకారణంగా నిలిచిందని అభినందించారు. “మై సెల్యూట్ టు గాడ్స్ ఓన్ ఛైల్డ్ రాజమౌళి అండ్ హీజ్ టీమ్” అంటూ ట్వీట్ చేశారు.
సూపర్ స్టార్ ప్రశంసలతో రాజమౌళి ఆనందంలో మునిగిపోయారు. “స్వయంగా దేవుడే వచ్చి మమ్మల్ని దీవించినట్టు ఉంది” అంటూ రీట్వీట్ చేశారు. మీ ట్వీట్ మా బృందాన్ని గాల్లో తేలిపోయేలా చేసిందని పోస్ట్ చేశారు. రజనీకాంత్ తో పాటు దర్శకుడు శంకర్ కూడా బాహుబలి-2 సినిమాను మెచ్చుకున్నారు. “ఇప్పుడే బాహుబలి-2 సినిమా చూశాను. ఇండియన్ సినిమా గర్వించదగ్గ చిత్రం. సినిమాలో భారీతనం, అందం, మ్యూజిక్ అన్నీ అద్భుతం. హ్యాట్సాఫ్ టు రాజమౌళి” అని ట్వీట్ చేశాడు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














