Rajinikanth : రజిని ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ చెప్పిన కుమార్తె సౌందర్య

తమిళనాట మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరో సూపర్ స్టార్ రజిని కాంత్. ఆయనకు ఉన్న క్రేజ్ ఎలాంటిది అంటే ఆయన ఫ్యాన్స్ రజిని ని ఒక హీరోలా కాకుండా ఒక దేవుడిలా అభిమానిస్తారు అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఆయన జీవిత కథపై సినిమా చేస్తున్నారని ఎప్పటి నుంచో చాలా వార్తలు వినపడుతుండగా, స్వయంగా రజిని కుమార్తె సౌందర్య ఒక ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ కు దీనికి సంబంధించి అదిరిరిపోయే న్యూస్ చెప్పారు.

Rajinikanth

ఇప్పుడు ఆ లెజెండ్ జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోయే ఆటోబయోగ్రఫీపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అయితే సూపర్ స్టార్ రజినినే స్వయంగా తన జీవితకథను బుక్ గా రాయటం మొదలు పెట్టారని తెలిపింది. ఈ పుస్తకం కేవలం ఒక సినీ నటుడి విజయగాథ మాత్రమే కాదని, అది ప్రతి ఒక్కరి జీవితానికి కనెక్ట్ అయ్యే ప్రయాణమని ఆయన కుమార్తె, దర్శకురాలు సౌందర్య రజినీకాంత్ వెల్లడించారు. చిన్న స్థాయి జీవితం నుంచి దేశం గర్వించే సూపర్ స్టార్‌గా ఎదిగిన రజినీకాంత్ ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుంది. అయితే ఈ పుస్తకంలో ఆయన కీర్తి, స్టార్‌డమ్ మాత్రమే కాదు. ఆయన జీవితాన్ని మలిచిన క్రమశిక్షణ, వినయం, ఆధ్యాత్మిక సమతుల్యత వంటి విలువలకు ప్రధాన స్థానం ఉంటుందని సమాచారం. ఇవే ఆయన కథను భాషలు, ప్రాంతాలు దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేస్తాయని సౌందర్య అభిప్రాయపడుతున్నారు.

తెలుగు ప్రేక్షకుల విషయానికి వస్తే రజినీకాంత్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకం. ‘పెదరాయుడు’, ‘నరసింహ’, ‘శివాజీ’, ‘రోబో’ వంటి సూపర్ హిట్ తెలుగు చిత్రాలు ఇక్కడ ఆయనకు అచంచలమైన అభిమాన వర్గాన్ని తెచ్చిపెట్టాయి. థియేటర్‌లో ఆయన ఎంట్రీకి వచ్చే విజిల్స్, కట్‌అవుట్లకు చేసే పూజలు, ఫస్ట్ డే ఫస్ట్ షో సందడి. ఇవన్నీ రజినీ అంటే తెలుగు ఫ్యాన్స్‌కు ఉన్న అభిమానానికి నిదర్శనం.

ఈ ఆటోబయోగ్రఫీ ద్వారా అభిమానులు తెరపై కనిపించే సూపర్ స్టార్‌ను మాత్రమే కాదు, ఆ లెజెండ్ వెనుక ఉన్న మనిషిని తెలుసుకునే అవకాశం దక్కనుంది. విడుదల ఎప్పుడు అనేది ఇంకా స్పష్టత లేకపోయినా, రజినీకాంత్ జీవిత కథను ఒక ముఖ్యమైన సాంస్కృతిక డాక్యుమెంట్‌గా ఇప్పటికే చాలామంది చూస్తుండటం విశేషం.

Nagarjuna : కింగ్ 100 లో టబు నటిస్తోందా..? నాగార్జున సమాధానం ఏంటంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus