మెగాస్టార్ చిరంజీవి మరియు రజినీ కాంత్ లు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే.వీరిద్దరూ తాము చెయ్యబోయే సినిమాల విషయాల్లో కూడా ఒకరికొకరు సూచనలు ఇచ్చుకునే వారు. ఎటువంటి ఇగోలు లేకుండా వీరిద్దరూ ఒకరి సలహాలను మరొకరు గౌరవించుకునే వారు. కేవలం సినిమాల విషయాలలోనే కాదు రాజకీయాల విషయంలో కూడా ఇద్దరూ ఒకే బాటలో నడవాలని ఫిక్స్ అయ్యారు. ఈ విషయంలో చిరు ఎలాగో పెద్ద గుణపాఠమే నేర్చుకున్నారు.
అందుకే రాజకీయాలకు దూరమయ్యి ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ అభిమానులను ఎంజాయ్ చేయిస్తున్నారు.మొన్నటి వరకూ సొంతంగా పార్టీ పెట్టాలని డిసైడ్ అయిన రజినీ కూడా ఇప్పుడు ఆ ప్రయత్నాలు మానుకున్నాడు. దీనికి కారణం చిరు.. రజినీని హెచ్చరించడమే అనేది ఇప్పుడు చెన్నై మీడియా వర్గాల్లో వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజకీయాల వైపు వెళ్ళొద్దని.. రెండు రకాలుగా కూడా ఇబ్బంది పడాల్సి వస్తోందని చిరు తెగేసి చెప్పారట.
చిరు అనుభవమే తనకు పెద్ద గుణపాఠమని భావించిన రజినీ.. రాజకీయాలకు గుడ్ బై చెప్పారట. ఇవి రజినీ తన సన్నిహితులతో చెప్పిన మాటలని తెలుస్తుంది.ముందుగా ‘అన్నాత్తై’ సినిమాని ఫినిష్ చేసిన తరువాత కొంత గ్యాప్ తీసుకుని వరుసగా సినిమాలు చెయ్యడానికే ప్రాముఖ్యత ఇవ్వాలని రజినీ భావిస్తున్నట్టు తెలుస్తుంది.