Veera Simha Reddy: ఈ క్షణం ఎంతో అద్భుతమైనది… డైరెక్టర్ ట్వీట్ వైరల్!

ఇటీవల క్రాక్ సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని తాజాగా వీర సింహారెడ్డి సినిమా ద్వారా మరొక బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా నందమూరి అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది.

ఇక ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ సినిమా మీద ప్రశంసలకు కురిపించారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ కూడా వీరసింహారెడ్డి సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఇటీవల బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా వీక్షించిన రజనీకాంత్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కి ఫోన్ చేసి అభినందనలు తెలియజేసినట్లు గోపీచంద్ స్వయంగా వెల్లడించాడు. సోషల్ మీడియా వేదికగా గోపీచంద్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో ” ఈ క్షణం చాలా అద్భుతమైనది.

సూపర్ స్టార్ రజనీ కాంత్ గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు. వీరసింహారెడ్డి సినిమా చుసానని, సినిమా మేకింగ్ బాగా ఆయనకు నచ్చిందని చెప్పినట్లు గోపీచంద్ వెల్లడించాడు. ఈ క్రమంలో సినిమా యూనిట్ కి రజనీ కాంత్ శుభాకాంక్షలు తెలియజేశారని గోపీచంద్ ట్వీట్ చేశాడు. అయితే సినిమా గురించి రజనీకాంత్ ప్రశంసించడంతో గోపీచంద్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. నా సినిమా గురించి ఆయన మాట్లాడిన మాటలు, ఆయన భావోద్వేగం ఇంతకన్నా నాకు విలువైనది ఏదీ లేదు.

థాంక్యూ రజనీ కాంత్ సర్ అంటూ ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేశాడు. స్వయంగా రజనీ కాంత్ ఇలా సినిమా గురించి ప్రశంసించడంతో వీర సింహారెడ్డి సినిమా యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదలైన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus