Rajinikanth: వరల్డ్ కప్ గురించి జోస్యం చెప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్?

గురువారం జరిగిన న్యూజిలాండ్ భారత్ మ్యాచ్ చూడడం కోసం సెలబ్రిటీలందరూ కూడా ముంబై వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే . ఇలా పలువురు సెలబ్రిటీలు ముంబై స్టేడియంలో సందడి చేశారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ సతీసమేతంగా ముంబై వెళ్లి ఈ మ్యాచ్ వీక్షించారు. ఇండియా గెలవడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ముంబైలో మ్యాచ్ ముగిసిన అనంతరం గురువారం రజనీకాంత్ చెన్నై చేరుకున్నారు.

ఇలా చెన్నై చేరుకున్నటువంటి ఈయన వరల్డ్ కప్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మొదట్లో కాస్త టెన్షన్ అనిపించినప్పటికీ తర్వాత ఆటగాళ్లు ఆట తీర చూసి టెన్షన్ మొత్తం పోయిందని రజనీకాంత్ తెలియజేశారు. ఇకపోతే ఫైనల్స్ చేరుకున్నటువంటి ఇండియన్ క్రికెటర్ల గురించి మాట్లాడుతూ ఈసారి తప్పకుండా కప్పు మనకే వస్తుందని ఈయన జోస్యం చెప్పారు.

జరగబోయే ఫైనల్స్ లో ఇండియా తప్పకుండా కప్పు గెలుచుకుంటుందని (Rajinikanth)  రజినీకాంత్ ఇలా నమ్మకంగా చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా రజనీకాంత్ చెప్పిన విధంగానే ఇండియా టీమ్ వరల్డ్ తప్పు గెలవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే అభిమానులు అందరూ కూడా గత వరల్డ్ కప్ మ్యాచ్ కి ఈ మ్యాచ్ కు భేదాలను గుర్తిస్తూ ఈసారి ఇండియాకు అన్ని రంగాలలో కూడా గొప్ప అవార్డులు వచ్చాయి. ఈ క్రమంలోనే క్రికెట్లో కూడా ఈసారి వరల్డ్ కప్ మనదే అంటూ ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ప్రభాస్ అభిమానులైతే ఏకంగా ఈసారి ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే ప్రభాస్ సలార్ సినిమా కూడా హిట్ అవుతుంది అంటూ పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. ఏది ఏమైనా వరల్డ్ కప్ మ్యాచ్ పై అందరి ఆసక్తి ఉందని చెప్పాలి. రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే ఈయన తాజాగా జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus