Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

తలైవా రజినీకాంత్ రిటైర్మెంట్ వార్త కోలీవుడ్‌ను, ఆయన అభిమానులను పెద్ద షాక్‌కు గురిచేస్తోంది. ‘జైలర్ 2’, ఆ తర్వాత సుందర్ సి సినిమాలు లైన్‌లో ఉండగా, హఠాత్తుగా ఈ రిటైర్మెంట్ ప్రచారం ఎందుకు మొదలైంది? విశ్వనటుడు కమల్ హాసన్‌తో చేయబోయే చిత్రమే ఆయనకు చివరిది అవుతుందన్న టాక్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Rajinikanth

ఇది హఠాత్ నిర్ణయం కాదని, దీని వెనుక పక్కా ‘లెగసీ’ ప్లానింగ్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. 74 ఏళ్ల వయసులో, అనారోగ్య సమస్యలను కూడా తట్టుకుని రజినీ ఇంకా సినిమాలు చేస్తున్నారంటే అది కేవలం అభిమానుల కోసమే. అయితే, ఎక్కడ ఆపాలో తెలియడం కూడా ఒక కళ. ‘సూపర్ స్టార్’ అనే ట్యాగ్‌కు తగ్గట్టుగానే ఆయన తన వీడ్కోలును కూడా ప్లాన్ చేసుకుంటున్నారట.

అందుకే ఈ ‘కమల్’ ఫ్యాక్టర్ తెరపైకి వచ్చింది. రజినీకాంత్ ఎప్పుడు రిటైర్ అయినా అది పెద్ద వార్తే. కానీ, ఆ రిటైర్మెంట్ ‘జైలర్ 2’తోనో, సుందర్ సి సినిమాతోనో అయితే అది కేవలం మరో సినిమాగా మిగిలిపోతుంది. అదే, తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో స్నేహితుడిగా, పోటీదారుడిగా ఉన్న కమల్ హాసన్‌తో కలిసి నటించిన సినిమాతో ముగిస్తే, దానికి చరిత్రలో దక్కే స్థానమే వేరు.

ఇది ఒక ‘పోలిటికల్ ఫినిషింగ్ టచ్’ లాంటిది. ఇద్దరు దిగ్గజాలు, తమిళ సినిమాకు రెండు కళ్లుగా ఉన్నవారు, తమ కెరీర్ చివర్లో ఒకే ఫ్రేమ్‌లో కనిపించి, ఆ సినిమాతోనే రజినీ తప్పుకోవడం అనేది ఒక ‘ఎపిక్’ ముగింపు అవుతుంది. బహుశా, ఆ ఒక్క సినిమా కోసమే రజినీ ఇన్నాళ్లూ ఎదురుచూశారేమో!

అందుకే, ‘జైలర్ 2’, సుందర్ సి ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసి, తన కెరీర్‌కు ‘ఫైనల్ పంచ్’ ఇచ్చే ఆఖరి సినిమా కోసం రజినీ సిద్ధమవుతున్నారని సమాచారం. ఆయన వీడ్కోలు కూడా తన స్టార్‌డమ్‌కు తగ్గట్టే, చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలన్నదే తలైవా అసలు ప్లాన్ అని టాక్ వాస్తోంది. మరి ఈ విషయంలో తలైవా టీమ్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus