షూటింగ్ అంటే ససేమిరా అంటున్న రజిని

కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలలో తమిళనాడు ముందు వరుసలో ఉంది. ముఖ్యంగా చెన్నై సిటీలో కరోనా వైరస్ విజృభిస్తుంది. వైరస్ అధిక ప్రభావిత ప్రాంతాలలో లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజిని కాంత్ షూటింగ్ కి హాజరుకానని చెప్పేశాడట. మీరు కూడా 2020 ముగిసే వరకు షూటింగ్ కి వెళ్లవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట. ప్రస్తుతం రజిని కాంత్ మాస్ చిత్రాల దర్శకుడు శివతో అన్నాత్తే చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకుంది.

45 శాతం వరకు షూటింగ్ పూర్తి కాగా లాక్ డౌన్ తరువాత బ్రేక్ పడింది. ఇంకా 60 నుండి 70 రోజుల పాటు షూటింగ్ మాత్రమే మిగిలివుండగా…2020 లో పూర్తి చేసి 2021 సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. ఐతే రజిని కాంత్ 2020 ముగిసే వరకు అన్నాత్తే షూటింగ్ లో పాల్గొనను అన్నారట. కరోనా వైరస్ ఇప్పటికే అనేక మంది నటులకు సోకటం జరిగింది. కాగా రజిని కాంత్ వయసురీత్యా ఆయనకు కరోనా సోకితే అత్యంత ప్రమాదానికి దారితీసే ఆస్కారం ఉంది.

ఇక కరోనా వైరస్ భారత్ లో మరింతగా విజృభించడంతో పాటు, ప్రపంచంలోనే అత్యధిక కరోనా రోగులు ఉన్న జాబితాలో మూడో స్థానానికి చేరింది. ఈ పరిస్థితుల మధ్య షూటింగ్ తిరిగి ప్రారంభించిడం అంత సేఫ్ కాదనేది ఆయన ఆలోచనగా తెలుస్తుంది. ఆ కారణంగానే రజిని అన్నాత్తే మూవీ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇక అన్నాత్తే మూవీలో మీనా, కుష్బూ వంటి సీనియర్ హీరోయిన్స్ తో పాటు కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ మూవీపై రజిని ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus