Rajinikanth: ‘కూలీ’ నుండి రజినీకాంత్ బర్త్ డే ట్రీట్.. ‘చికిటు వైబ్’ ఎలా ఉందంటే?

Ad not loaded.

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)  నుండి ఫాన్స్.. డాన్స్ ని ఫాన్స్ ఆశించరు. చిన్న చిన్న మూమెంట్స్ తో స్టైల్ మిస్ అవ్వకుండా ఉంటే చాలు అనుకుంటారు. అందుకే రజినీకాంత్ కూడా పెద్దగా ఇబ్బంది పడకుండా వాళ్ళు ఆశించిన స్టైల్ ను అన్ని విధాలుగా అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. గతేడాది వచ్చిన ‘కావాలయ్యా’ సాంగ్ కావచ్చు, ఈ ఏడాది వచ్చిన ‘మనసిలాయో’ సాంగ్ కావచ్చు.. రజినీ స్టైల్ తో చిన్న చిన్న డాన్స్ మూమెంట్స్ కలిపి లాంగించేసినవే..!

Rajinikanth

అయితే ‘హుకుం..’ ‘హి సూపర్ స్టార్ డా’ వంటి సాంగ్స్ లో రజినీ వాకింగ్ స్టైల్ ని ఎంజాయ్ చేసే వారి సంఖ్య ఎక్కువ అనడంలో సందేహం లేదు. రెండిటిలో ఏం కావాలి? అని ఫ్యాన్స్ ని అడిగితే ‘హుకుం’ వంటి ఎలివేషన్ సాంగ్స్ ఉంటే చాలు అంటారు. కానీ దర్శకుడు లోకేష్ కనగరాజ్  (Lokesh Kanagaraj) .. డాన్స్ కోసం రజినీని కాస్త ఎక్కువగానే ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది. విషయం ఏంటంటే.. ఈరోజు రజినీకాంత్ బర్త్ డే. దీంతో ఆయన నెక్స్ట్ మూవీ కూలీ (Coolie)  నుండి ఓ చిన్న వీడియోని యూట్యూబ్లో వదిలారు.

రజినీకాంత్ బర్త్ డేకి ఎక్కువగా టీజర్ వంటివి రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం డాన్స్ తో ఉన్న చిన్న ప్రోమోని వదిలారు. ‘చికిటు వైబ్’ అనే పేరుతో ఈ వీడియోను విడుదల చేశారు. ఇందులో రజినీకాంత్ డాన్స్ మూమెంట్స్ ఉన్నాయి. 74 ఏళ్లలో ఇబ్బంది పడుతూనే రజినీకాంత్ డాన్స్ చేసినట్టు స్పష్టమవుతుంది. మిగిలిన డాన్సర్స్ తో పోటీపడి వేయలేకపోయినా.. తన స్టైల్ తో లాగించేశారు రజినీ. మరి ఆయనతో ఇలా చేయించాలని దర్శకుడు లోకేష్ కి ఎందుకు అనిపించిందో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus