తెలుగు అభిమానుల పరిస్థితేంటి రజినీ

ఇంకా ‘2.0’ చిత్రం హవా ఇంకా థియేటర్లో కొనసాగుతూనే ఉండగా ‘పెట్టా’ చిత్ర ప్రమోషన్లు మొదలు పెట్టేసాడు రజినీ. రజినీ కాంత్ పుట్టిన రోజు సందర్బంగా ‘పెట్టా’ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే తెలుగు టీజర్ కాదు, కేవలం తమిళ్ టీజర్ మాత్రమే. తమిళ్ తో పాటు తెలుగులో కూడా రజినీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ‘పెట్టా’ చిత్ర తెలుగు వెర్షన్ కు సంబందించి ఒక్క అప్డేట్ రాకపోవడంతో తెలుగులో ఉన్న రజినీ ఫ్యాన్స్ నిరుత్సాహ పడుతున్నారట.

ఇప్పటి వరకు కనీసం తెలుగు వెర్షన్ కు సంబంధించి టైటిల్ ను కూడా అనౌన్స్ చేయలేదు. విడుదల చేసిన పాటలు కూడా తమిళ పాటలే కావడం గమనార్హం. ‘పెట్టా’ చిత్రం తెలుగు వెర్షన్ కు సంబంధించి ఇంకా అప్డేట్ ఇవ్వక పోవడానికి ప్రధాన కారణం ఇక్కడ సంక్రాంతికి బడా సినిమాలు ఉండడమే అని చెప్పుకొస్తున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు. ‘వినయ విధేయ రామ’ ‘ఎన్టీఆర్’ ‘ఎఫ్ 2’ వంటి చిత్రాలు ఉండటంతో థియేటర్స్ దొరకడం కష్టమని చిత్ర నిర్మాతలు తెలుగు వెర్షన్ లేట్ చేస్తున్నారని టాక్. పిజ్జా ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సిమ్రాన్ .. త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘పెట్టా’ చిత్రం తెలుగు వెర్షన్ ను ఫిబ్రవరి లో విడుదల చేసే పనిలో చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus