రజినీ – మురుగదాస్ కాంబినేషన్ ఫిక్స్ అయినట్టేనా..?

రజినీకాంత్ 2018 లో ‘కాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం నిరాశపరిచినప్పటికీ.. తాజాగా విడుదలైన ‘2.0’ చిత్రం మంచి కల్లెక్షన్లను సాధిస్తుంది. శంకర్ – రజినీ కంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం కావడంతో చిత్ర ప్రారంభంనుండే మంచి హైప్ ను సొంతం చేసుకుంది. ‘2.0’ సినిమా చేస్తూనే మరో పక్క కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో ‘పేటా’ అనే చిత్రాన్ని చక-చకా పూర్తి చేశాడు తలైవా. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతోందని సమాచారం. ఈ చిత్రం పూర్తయిన వెంటనే రజినీ తన పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ రజినీ తన 166 వ చిత్రాన్ని లైన్లో పెట్టినట్టు సమాచారం.

విషయంలోకి వెళితే తాజాగా ఇళయ దళపతి విజయ్ తో ‘సర్కార్’ చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టిన మురుగదాస్ దర్శకత్వంలో రజినీ ఓ చిత్రాన్ని చేయబోతున్నట్టు సమాచారం. మహేష్ బాబుతో ‘స్పైడర్’ చిత్రం తెరకెక్కిస్తున్న సమయంలోనే మురుగదాస్ రజినీకి ఒక లైన్ వినిపించారట. మురుగదాస్ వినిపించిన లైన్ నచ్చడంతో స్క్రిప్ట్ డెవలప్ చేసి తీసుకురమ్మని రజినీ చెప్పారంట. తరువాత రజినీ ‘కాలా’ ‘2.0’ ‘పేట’ చిత్రాలతో బిజీగా ఉండగా.. మురుగదాస్ విజయ్ ‘సర్కార్’ తో బిజీగా ఉండటంతో కొంచెం గ్యాప్ ఏర్పడిందని సమాచారం. అయితే ఇప్పుడు ఆ కథకు రజినీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. రాజకీయాల నేపథ్యంలో సాగే కథ కావడంతో… రజినీ పొలిటికల్ ఎంట్రీకి బాగా ఉపయోగపడుతుందంటూ ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ‘సర్కార్’ ‘పేట’ చిత్రాలను నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతోందంట. మిగిలిన స్టార్ హీరోలందరూ ఒక చిత్రం చేయడానికే.. కిందా.. మీదా పడుతుంటే.. రజినీ మాత్రం రెండేసి… మూడేసి చిత్రాలు చేస్తూ కుర్ర హీరోలకు ఛాలెంజ్ విసరడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus