రజనీకే ఝలక్ ఇచ్చిన టెక్కీ..!!

సాంకేతికంగా పరిజ్ఞానం కలిగిన ఓ యువకుడు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఝలక్ ఇచ్చాడు. రజనీకి తెలియకుండా ఆయన ట్విట్టర్ అకౌంట్ లోకి జొరబడ్డాడు. అంతేకాదు “హిట్ టు కిల్” అని పోస్ట్ చేసి అభిమానులకు ముచ్చెమటలు పట్టించాడు. ఈ ట్వీట్ సంచలనం సృష్టించింది. వెంటనే సూపర్ స్టార్ కుమార్తె సౌందర్య స్పందించి అసలు విషయం చెప్పారు. “నాన్నఅకౌంట్ ని ఎవరో హ్యాకింగ్ చేశారు. వారు చేసిన పోస్ట్ పూర్తిగా అబద్దం. నాన్న గారు బాగున్నారు

ఆయన అకౌంట్ ని ఆధీనంలోకి తీసుకున్నారు” అని ట్వీట్ చేయడంతో సినీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రజనీ నటించిన కబాలి చిత్రం జులై 22 న విడుదలై ప్రపంచవ్యాప్తంగా కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. 400 కోట్ల క్లబ్ లో చేరడానికి ఉరకలేస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ రోబోకి సీక్వెల్ లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీతో మరోసారి సత్తా చాటేందుకు రజనీ శ్రమిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus