Coolie: కూలీ బిజినెస్ బ్లాస్ట్..తెలుగులో ఊహించని రేటు!

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’ (Coolie) చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. బుల్లెట్ స్పీడ్‌తో మూవీ విడుదలకు సన్నాహాలు చేస్తున్న మేకర్స్, తాజాగా రిలీజ్ డేట్‌ను ఖరారు చేశారు. ఆగస్టు 14న కూలీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇదే రోజున ఎన్టీఆర్ (Jr NTR) హృతిక్ రోషన్ (Hrithik Roshan) కాంబినేషన్‌లో వస్తున్న హిందీ మూవీ వార్ 2 (War 2)కూడా విడుదల కావడంతో భారీగా క్లాష్ జరగబోతోంది.

Coolie

అయితే ఈ పోటీతో సినిమా పై ఆసక్తి మరింతగా పెరుగుతోంది. ఈ గట్టిపోటీకి తోడు, తెలుగు రాష్ట్రాల్లో కూలీకి భారీ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తాజా సమాచారం. తెలుగు డబ్బింగ్ హక్కులు దాదాపు రూ. 40 కోట్లుకి అమ్ముడుపోయాయని టాక్. ఇది రజినీ సినిమాల పంథాలోనే కాదు, కోలీవుడ్ డబ్బింగ్ చిత్రాల్లోనే నెవ్వర్ బిఫోర్ రేంజ్ అని చెప్పాలి. గతంలో సూర్య (Suriya)  కంగువ (Kanguva) రూ.25 కోట్లు, విజయ్ లియో (LEO) రూ.20 కోట్లు, రజినీ జైలర్ (Jailer) రూ.17 కోట్లకు మాత్రమే అమ్ముడవ్వగా..

ఈసారి కూలీ బిజినెస్ రేంజ్ దాటేసింది. ఇది రజినీ మార్కెట్‌కు కొత్త వెర్షన్‌ను చూపిస్తోంది. ఈ సినిమాకు రజినీ కెరియర్‌లోనే ఓ స్పెషల్ రికార్డ్ గా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున(Nagarjuna), ఉపేంద్ర (Upendra), శ్రుతిహాసన్ (Shruti Haasan) ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ క్యాస్టింగ్, గ్రాండ్ మేకింగ్‌తోపాటు లోకేష్ బ్రిలియంట్ స్టైల్ కూడా కలవడం ఈ సినిమాకు బిగ్గెస్ట్ అస్త్రంగా మారుతోంది.

ఇకపోతే, తెలుగు ఆడియెన్స్ ఇప్పటివరకు రజినీ సినిమాలకు చూపిన ఆదరణను దృష్టిలో పెట్టుకుంటే కూలీ కూడా బాక్సాఫీస్ దగ్గర హవా చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. బిజినెస్ పరంగా ఇప్పటికే కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్చేసిన కూలీ, కంటెంట్ పరంగా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటే, ఇది రజినీకి మరో ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ కావడం ఖాయం.

జాక్ రిలీజ్‌కు మెగా టెన్షన్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus