రజినీ కాంత్ కాలా మూవీ నిడివి ఎంతంటే ?

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్  రజినీ కాంత్  డాన్ గా నటించిన బాషా సంచలన విజయం సాధించింది. అటువంటి కాన్సెప్ట్ తోనే యువ దర్శకుడు పా.రంజిత్ ‘కబాలి’ చిత్రాన్ని తెరకెక్కించారు. మళ్ళీ డాన్ గా కనిపిస్తుండడంతో ఈ చిత్రం భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది. అయితే అంచనాలను అందుకోలేకపోయింది.  రజినీ కాంత్ కి మాత్రం రంజిత్ టేకింగ్ బాగా నచ్చింది. అందుకే వెంటనే మరో అవకాశాన్ని ఇచ్చారు. శంకర్ దర్శకత్వంలో 2.0 మూవీ చేస్తూ.. ఆ షెడ్యూల్ గ్యాప్ లో కాలాని కంప్లీట్ చేశారు. ఇందులోనూ డాన్ గా కనిపించనున్నారు. అయితే లోకల్ డాన్. ముంబై లోని ధారవి బ్యాక్ డ్రాప్లో నడిచే ఈ చిత్రంలో నానా పటేకర్, హుమా ఖురేషి, ఈశ్వరి రావులు కీలక పాత్రలు పోషించారు. రజనీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మించిన

ఈ చిత్రం పోస్ట్ ప్రొడకహ్స్న్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ  రన్ టైమ్ 2 గంటల 45 నిముషాలుగా వచ్చిందంట. వాస్తవానికి సినిమాని రెండున్నర గంటలకు ట్రిమ్ చేయాలనీ చిత్ర బృందం ప్రయత్నించగా కుదరలేదని తెలిసింది. రజనీ చేసిన యాక్షన్ సీన్స్ అద్భుతంగా వచ్చాయని.. అవి మాస్ ఆడియన్స్ ని విశేషంగా కట్టుకుంటాయని సమాచారం. రజినీ కాంత్ 2.0 మూవీ నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను 125 కోట్లకి  సొంతం చేసుకుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో  జూన్ 7వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus