Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

74 ఏళ్ల వయసులోనూ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)  ఫుల్ జోష్‌తో వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘కూలీ’ (Coolie) సినిమా చేస్తున్న రజనీ, ఈ సినిమాతో భారీ అంచనాలు సృష్టించాడు. ‘కూలీ’ ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో ‘జైలర్ 2’లో నటిస్తున్నాడు. 2023లో విడుదలై రూ.650 కోట్లు వసూలు చేసిన ‘జైలర్’(Jailer) , రజనీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది, ఇప్పుడు దాని సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Rajinikanth

‘జైలర్ 2’ సినిమాను నెల్సన్ మరింత భారీగా తెరకెక్కిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ (Kalanithi Maran) నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు. శివరాజ్‌కుమార్ (Shiva Rajkumar), మోహన్‌లాల్‌తో (Mohanlal) పాటు మరికొందరు స్టార్లు గెస్ట్ రోల్స్‌లో కనిపించే అవకాశం ఉందని సమాచారం. అనౌన్స్‌మెంట్ టీజర్ 48 గంటల్లో 13 మిలియన్ వీక్షణలతో సంచలనం సృష్టించింది, 2026లో ఈ సినిమా విడుదల కానుందని అంటున్నారు.

అయితే, ‘జైలర్ 2’ కోసం రజనీకాంత్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి. ఈ సినిమా కోసం రజనీ ఏకంగా రూ.260 కోట్లు డిమాండ్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ మొత్తం నిజమైతే, కోలీవుడ్‌లోనే కాక భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుడిగా రజనీ రికార్డు సృష్టిస్తాడు. ‘జైలర్’ సమయంలో రూ.100 కోట్లకు పైగా తీసుకున్న రజనీ, ఈసారి ఈ భారీ జంప్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

‘జైలర్’ విజయంలో రజనీ స్టైలిష్ నటన, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ క్యామియోలు, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించాయి. ఈసారి ‘జైలర్ 2’ను మరింత గ్రాండ్‌గా తీసుకొస్తున్న నెల్సన్, రజనీ ఎనర్జీని మరో స్థాయిలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా కోసం రజనీ తీసుకుంటున్న రెమ్యునరేషన్ వార్తలు నిజమైతే, అది ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

రజనీకాంత్ ఈ వయసులోనూ తన స్టార్‌డమ్‌ను అస్సలు తగ్గనీయకుండా, వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. ‘కూలీ’ సినిమాతో రజనీ యాక్షన్ అవతార్‌ను మరోసారి చూపించనుండగా, ‘జైలర్ 2’తో అతని మాస్ ఫాలోయింగ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ రెమ్యునరేషన్ రూమర్ నిజమో కాదో తెలియాల్సి ఉన్నప్పటికీ, రజనీ స్టార్‌డమ్ ఇప్పటికీ టాప్‌లోనే ఉందని చెప్పవచ్చు.

పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus