హిట్‌ మెషీన్‌ లాంటి దర్శకుడికి సౌత్‌ హీరోల సాయం అవసరమా అధ్యక్షా!

మన దేశంలో అపజయం ఎరుగని దర్శకుల లిస్ట్‌ అంటూ ఒకటి రాస్తే.. అందులో తొలుత రాయాల్సిన పేరు రాజ్‌ కుమార్‌ హిరానీ (Rajkumar Hirani). దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన ఆరు సినిమాలు భారీ విజయం అందుకున్నవే. అలా అని ఆయన ఫక్తు కమర్షియల్‌ సినిమాలు తీసి వాటితోనే విజయాలు అందుకున్నారు అని చెప్పలేం. సందేశం, భావోద్వేగం, కమర్షియల్‌ అంశాలు మేళవించి విజయాలు సాధిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తికి ఇతర సినిమా పరిశ్రమల సాయం అవసరమా?

Rajkumar Hirani

ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకంటే కథను ముందు పెట్టి, స్టార్‌ హీరోను సైతం వెనక్కి పెట్టి సినిమాలు తీయడంలో ఆయన దిట్ట. అలా ఆయన ఇప్పటివరకు ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’, ‘లగే రహో మున్నాభాయ్‌’ (Lage Raho Munna Bhai), ‘3 ఇడియట్స్‌’ (3 Idiots), ‘పీకే’, ‘సంజు’, ‘డంకీ’ (Dunki) సినిమాలు చేసుకొచ్చారు. ఈ సినిమాలన్నింటిలో స్టార్‌ హీరోలే నటించారు. అయితే ఆ సినిమాల పేర్లు చెప్పినప్పుడు వాళ్ల పేర్లు మాత్రమే కాదు, రాజ్‌ కుమార్‌ హిరానీ పేరు కూడా గుర్తొస్తుంది. ఇంత తెలిశాక కూడా ఆయనకు మరో సినిమా పరిశ్రమలోని నటుల సాయం అవసరమా?

ఇప్పుడు అసలు పాయింట్‌కి వచ్చేద్దాం. రాజ్‌ కుమార్‌ హిరానీ ఇప్పుడు ‘మున్నాభాయ్‌ 3’ అనే సినిమా తీసే పనిలో ఉన్నారు. సంజయ్‌ దత్‌ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి కథ పనులు తుది దశకు వచ్చాయి. ఈ క్రమంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈ విషయం బయటకు రాగానే.. ఈ సినిమాలో సౌత్‌ స్టార్‌ నటుల ఎంట్రీ కూడా ఉంటుంది అనే మాట బయటకు వచ్చింది.

టాలీవుడ్‌ నుండి వెంకటేష్ (Venkatesh), కన్నడ పరిశ్రమ నుండి శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) , తమిళ సినిమా సీమ నుండి విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఈ సినిమాలో నటిస్తారు అని పుకార్ల సారాంశం. ఈ విషయం సినిమా ప్రారంభ సమయంలోనే చెప్పేస్తారు అని కూడా అంటున్నారు. ఇలాంటి నటుల కేమియోలు సినిమాలో ఉంటే ఓకే కానీ.. రాజ్‌ కుమార్‌ హిరానీ లాంటి హిట్‌ మెషీన్‌కి అవసరమా?

‘ఎల్ 2 – ఎంపురాన్’ .. అనుకున్నది ఒక్కటి అయినది ఇంకొక్కటి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus