నవంబర్ 21న చాలా చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వాటన్నికంటే చిన్న సినిమా అంటే ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే చెప్పాలి. అయితే అన్ని సినిమాలకంటే ఎక్కువ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా కూడా ఇదే. సురేష్ బొబ్బిలి రూపొందించిన పాట, ట్రైలర్ వంటివి సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. బన్నీ వాస్ సమర్పణలో ఈటీవీ విన్ సంస్థ మరియు వేణు ఊడుగుల నిర్మాతలుగా ఉండి రూపొందించిన ఈ సినిమా మొదటి షోతోనే మంచి టాక్ తెచ్చుకుంది.
ఓపెనింగ్స్ కూడా ఆరోజు రిలీజ్ అయిన సినిమాల కంటే కూడా బెటర్ గా వచ్చాయి. 4 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుంది.

ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 3.25 cr |
| సీడెడ్ | 0.28 cr |
| ఆంధ్ర(టోటల్) | 1.28 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 4.81 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.16 cr |
| ఓవర్సీస్ | 0.40 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 5.37 కోట్లు(షేర్) |
‘రాజు వెడ్స్ రాంబాయి'(Raju Weds Rambai) చిత్రానికి రూ.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.5.37 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటివరకు బయ్యర్స్ కి రూ.2.87 కోట్ల లాభాలు అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2 వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.
