సెకండ్‌ ఇన్నింగ్స్‌… సీమ బిడ్డగా

చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు… చక్కనమ్మ డీగ్లామర్‌ రోల్‌లో కనిపించినా అందమే. నిజమే కదా. అందుకేనేమో మన కథానాయికలు ఇటీవల కాలంలో డీ గ్లామర్‌ రోల్స్‌ చేయడానికి ముందుకొస్తున్నారు. అలా వచ్చినవాళ్లలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఒకరు. గ్లామర్‌ డాల్‌గా కనిపిస్తూనే, నటనకు ప్రాధాన్యమున్నపాత్రలు చేస్తూ వచ్చిన రకుల్‌ తొలిసారి డీ గ్లామర్‌ రోల్‌లో కనిపించబోతోందనే విషయం తెలిసిందే. వైష్ణవ్‌ తేజ్‌ -క్రిష్‌ కలయికలో వస్తున్న సినిమాలో రకుల్‌ డీగ్లామర్‌ రోల్‌లో నటిస్తోందనే గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈ విషయంలో రకుల్‌ స్పష్టత ఇచ్చింది.

వైష్ణవ్‌తేజ్‌ రెండో సినిమా క్రిష్‌ తెరకెక్కిస్తున్న సినిమాలో రకుల్‌ రాయలసీమ బిడ్డగా కనిపింబోతోందట. ఓబులమ్మ పాత్రలో తొలిసారి డీగ్లామర్‌ టచ్‌ ఇవ్వబోతోందట. అంతేకాదు సినిమా కోసం సీమ యాసలో డైలాగ్‌లు కూడా చెబుతుందట. ఈ విషయాల్ని ఆమే వెల్లడించింది. ‘‘నటిగా డిఫరెంట్‌ పాత్రలు పోషించడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడూ గ్లామర్‌ పాత్రలతోనే నటిస్తే మనకు తెలియకుండానే మనపై ఓ ఇమేజ్‌ పడిపోతుంది. అందుకే భిన్నమైన పాత్రలు చేస్తూ ఉండాలి’’ అంటూ డీ గ్లామర్‌ రోల్‌ ఎంచుకోవడం వెనుక ఉన్న కారణం చెప్పింది రకుల్‌.

కెరీర్‌ మంచి జోరులో ఉన్నప్పుడు బాలీవుడ్ అదృష్టం పరీక్షించుకుందామని ముంబయి ఫ్లైట్‌ ఎక్కింది రకుల్‌. అక్కడ సరైన విజయం దక్కకపోగా, ఇక్కడ సినిమాలకు దూరమైంది. తిరిగి తేరుకుని హైదరాబాద్‌లో దిగినా.. సరైన సినిమాలు రాలేదు. వచ్చిన ‘మన్మథుడు 2’ బాక్సాఫీసు దగ్గర డిజాస్టర్‌ అయ్యి కూర్చుంది. దీంతో ఇక కెరీర్ అయిపోయింది అనుకుంటున్న సమయంలో మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. క్రిష్‌-వైష్ణవ్‌ సినిమాతోపాటు, నితిన్‌ చెక్‌లో కూడా నటిస్తోంది. ఇవి కాకుండా ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయట.

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus