ఏదో “స్పైడర్”డిజాస్టర్ అవ్వడంతో ఒక్కసారిగా ఐరన్ లెగ్ అనే మార్క్ వచ్చేసింది కానీ.. నిజానికి అంతకుముందు వరకు రకుల్ ప్రీత్ ను లక్కీ మస్కట్ లా చూసుకొన్నారందరూ. ఆల్మోస్ట్ అందరూ యంగ్ హీరోస్ తో కలిసి నటించిన రకుల్ తెలుగుతోపాటు తమిళం, హిందీలోనూ బిజీ అవుతున్న తరుణంలో “స్పైడర్” దెబ్బ పడింది. “స్పైడర్” అనంతరం రకుల్ కి తెలుగులో ఒక్క ఆఫర్ కూడా లేదు. అలాగని అమ్మడు ఖాళీగా ఏమీ లేదనుకోండి. హ్యాపీగా తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది.
అయితే.. ఒక రెండు రోజులుగా రకుల్ ఐటెమ్ సాంగ్ చేస్తోందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై రకుల్ క్లారిటీ ఇచ్చింది. బోయపాటి చిత్రంలో రామ్ చరణ్ సరసన ఒక స్పెషల్ సాంగ్ చేసే అవకాశం వచ్చిన మాట వాస్తవమే కానీ.. ఇంకా తాను అంగీకరించలేదని, ఇప్పటివరకూ నేను ఒక్క స్పెషల్ సాంగ్ కూడా చేయలేదు. చేయాలన్న ఆసక్తి కూడా లేదు. అయితే.. కేవలం నా ఫ్రెండ్ చరణ్ మరియు నా ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి గారి కోసం చేయాలి. నేణు డిసైడ్ అయ్యేవరకూ ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయకండి అని కోరింది రకుల్.