Rakul Preet: బోల్డ్ పాత్రలో కనిపించనున్న రకుల్ ప్రీత్ సింగ్..!

బహుశా ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కండోమ్ ప్రోడక్ట్ ను టెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారట. అదే పాయింట్ తో ఇప్పుడు బాలీవుడ్లో ఓ మూవీ రూపొందనుంది. కండోమ్ టెస్ట్ చేసే వాళ్ళు ఏ విధంగా చేస్తారు అనేది కూడా ఎవ్వరికీ తెలీదు. ఆ అంశాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఈ ఆధ్యంతం ఎంటర్టైన్మెంట్ తో కూడుకుని ఉంటుందని సమాచారం.ఇంతకీ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించబోతుంది ఎవరో తెలుసా.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్. అవును ఆమెనే ఈ పాత్రకు ఫైనల్ అయినట్టు దర్శకుడు ఈ మధ్యనే క్లారిటీ ఇచ్చేసాడు.ఇదిలా ఉండగా.. ఈ పాత్రకి రకుల్ ఫస్ట్ ఆప్షన్ కాదట. ఈ పాత్రకు మొదట ఓ యంగ్ హీరోయిన్ ను ఎంపిక చెయ్యాలి అనుకున్నారట. జాన్వీ కపూర్, అనన్య పాండే, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్… వంటి వారిని సంప్రదించారట. కానీ ఇలాంటి పాత్రను చెయ్యడానికి వారు ఒప్పుకోలేదట.

దాంతో రకుల్ కు వినిపించి ఓకే చేయించుకున్నట్టు తెలుస్తుంది.రకుల్ కు తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.అక్కడ ఇప్పటికే ఆమె 3 ప్రాజెక్టులతో బిజీగా ఉంది.తెలుగులో మాత్రం ఒక్క సినిమానే చేస్తుంది.హిందీ ఏ ఛాన్స్ వచ్చినా ఈమె నొ చెప్పడం లేదని తెలుస్తుంది. ఇక కండోమ్ టెస్టర్ గా రకుల్ చెయ్యబోయే సినిమాకి ‘ఛత్రివాలి’ అనే టైటిల్ ను ఫైనల్ చేశారట. తేజస్ డియోస్కర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus