Rakul Preet: సినిమా కోసం రకుల్‌ సాహసం.. బ్రేవ్‌ గాళ్‌ అంటూ ఫ్యాన్స్‌ ఖుష్‌!

సినిమా కోసం ఎంత కష్టమైనా పడతాం అని అంటుంటారు మన సినిమా వాళ్లు. అయితే అందులో ఎంతమంది అలా చేస్తారు అనేది వేరే విషయం. కానీ చేసే వాళ్లలో హీరోయిన్లు కూడా ఉంటారు అనే విషయం మనం మరచిపోకూడదు. అలా ఓ కథానాయిక సినిమా షూటింగ్‌ కోసం ఏకంగా 14 గంటలపాటు నీళ్లలో ఉంది. 30 సెకన్ల ఆ సీన్‌ కోసం చాలా కష్టపడ్డాం అంటూ ఆ సినిమా వివరాలను ఇటీవల చెప్పుకొచ్చింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. సినిమా కోసం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చేసిన ఓ స్టంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

14 గంటల పాటు నీటి అడుగున ఉంది ఓ సినిమా సీన్‌ను షూట్‌ చేసిందట. రకుల్ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం ‘ఐ లవ్ యూ’ అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా కోసం రకుల్ ప్రీత్‌ సింగ్‌ మీద నీటి అడుగున కొన్ని సన్నివేశాలు తెరకకెక్కించారు. రెండు నిమిషాల 30 సెకన్ల పాటు ఉండే ఆ సీన్ కోసం నీటి అడుగున చాలా సేపు ఉండాల్సి వచ్చిందట. ఆ సీన్‌ చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే విషయాల్ని కూడా షేర్‌ చేసింది. ఆ సీన్‌ చేస్తున్నప్పుడు చాలా చిత్రమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను.

నీటి లోపల అస్సలు టెన్షన్ పడకూడదు. దీని కోసం నెల రోజులు కఠిన శిక్షణ తీసుకుందట రకుల్‌. ఆ అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం స్కూబా శిక్షకుడు అజహాన్ అడేన్ వాలా శిక్షణ ఇచ్చారట. రెండు నిమిషాల 30 సెకన్ల పాటు నీటి అడుగున పట్టు కోల్పోకుండా ఎలా ఉండాలో నేర్పించారట. అలా శిక్షణ పూర్తయ్యాక సీక్వెన్స్ మధ్యాహ్నం 2 గంటల నుండి తెల్లవారు జామున 4 గంటల వరకు సీన్‌ షూట్‌ చేశారట. దీని కోసం రెండు సెషన్స్ పని చేశాను అని రకుల్ చెప్పింది.

రోజంతా నీటిలో ఉండటం అంటే సవాలే. శరీరం చల్లబడకుండా ఉండటానికి ప్రతి షాట్ గ్యాప్ లో నా మీద వేడి నీళ్లు పోసేవారు. అయితే నీటిలో క్లోరిన్ కారణంగా కళ్లు మండిపోయాయి. ‘ఐ లవ్ యూ’ సినిమా కోసం రకుల్ ఈ సాహసం చేశారు. ఈ సినిమా జూన్ 16న జియో సినిమాలో విడుదల కాబోతుంది. రకుల్ నుండి డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూడో సినిమా ఇది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus