ముద్దు ముద్దు గా ఉండాలి – రకుల్

ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీతి సింగ్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈమె తన అందం, యాక్టింగ్ తో పాటు లిప్ లాక్ సీన్లలో జీవించేసి అవకాశాలను అందుకుంటోంది. ఆరేళ్లక్రితం కన్నడ సినిమా ద్వారా సినిమాల్లోకి వచ్చిన ఈ భామ ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ప్రవేశించింది. బాలీవుడ్ లోను “యారియాన్” చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ చిత్రంలో ఆమె లిప్లాక్ సీన్ చేసి అందరి కళ్ళు తన వైపు తిప్పుకుంది. అప్పటికే తెలుగులో వెంకట్రాది ఎక్స్ ప్రెస్ సినిమా విజయం సాధించడం ఆమెకు ప్లస్ అయింది. ఇక అవకాశాలు వెల్లువెత్తాయి.

అందులోనూ లిప్ లాక్ సీన్లలో నటించాలనే అభ్యర్ధనలు వచ్చాయి. అందుకు రకుల్ సై అంది. రఫ్, కిక్ 2, నాన్నకు ప్రేమతో సినిమాలలో ముద్దులతో పిచ్చెక్కింది. దీంతో లిప్ లాక్ సుందరిగా పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఆమె కొన్ని షరతులు పెడుతోంది. ఎందుకని రకుల్ ని అడిగితే.. “ప్రేమకు చిహ్నం ముద్దు. మాటల్లో తెలపలేని భావాన్ని ఒక ముద్దుతో చెప్పొచ్చు. అందుకే అటువంటి సన్నివేశాల్లో నటించడానికి నాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఆ ముద్దులు కథకు ప్రయోజనంగా ఉండాలి. ఆ సన్నివేశాన్ని ప్రచారం కోసం ఉపయోగించుకుంటే చిరాకుగా ఉంటుంది.” అని చెప్పింది. సినిమా ప్రచార వీడియోలో ముద్దుసీన్ ను పదే పదే చూపించడం వల్ల ఫీల్ పోతుందని.. కథలో లీనమై చూస్తున్నపుడు ఆ అనుభూతి పెరుగుతుందని రకుల్ వివరించింది. ఈమె ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ధ్రువ సినిమాలో నటిస్తోంది. ఇందులో ఏ విధంగా ప్రేమను పండించనుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus