ఆ మాటల్లో ఎంతమాత్రం నిజం లేదంటున్న రకుల్..!

సినీ ఇండస్ట్రీలో పార్టీలు ఎక్కువ జరుగుతుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పార్టీలకు వెళ్ళడం ద్వారా కొత్త నటీ నటులకి.. సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలతోను.. అలాగే క్రేజ్ ఉన్న వారితోనూ పరిచయాలు ఏర్పడుతుంటాయని.. అలా సినిమాల్లో ఛాన్స్ లు లభిస్తుంటాయని వార్తలు వస్తుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లకు అయితే ఇది బాగా ప్లస్ అవుతుంటుందనే టాక్ కూడా ఉంది. ఈ పార్టీ కల్చర్ అనేది 1980 నుండీ ఉందట. ఇప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది.

అయితే ‘పార్టీలకు వెళ్ళినంత మాత్రాన సినిమా అవకాశాలు వచ్చేస్తాయి అనేది జస్ట్ అపోహ మాత్రమే’.. అంటుంది రకుల్ ప్రీత్ సింగ్. ఈమధ్య ఈమెకు తెలుగు సినిమాల్లో ఎక్కువ అవకాశాలు రావడం లేదు. నితిన్.. చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న సినిమాలో మాత్రం రకుల్ నటిస్తుంది. ఇక తమిళంలో కమల్ హాసన్ ‘ఇండియన్2’ సినిమాలో కూడా నటిస్తుంది. అయితే ఈమె తరుచూ ఈమధ్య బాలీవుడ్ పార్టీలకు అటెండ్ అవుతూ ఉంటుంది. అవకాశాలు కోసమే ఇలా పార్టీలకు అటెండ్ అవుతుంది అనే కామెంట్స్ వచ్చాయి. అందుకే రకుల్ అలా స్పందించినట్టు తెలుస్తుంది.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus