మహేష్ బాబు, పూరి జగన్నాధ్ కాంబినేషన్లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ అయిన ‘పోకిరి’ చిత్రంలో బెగ్గర్స్ ఎపిసోడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఎపిసోడ్ లో కొందరు బెగ్గర్స్… సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బ్రహ్మీని చుట్టుముట్టి ఓ ఆట ఆడేసుకుంటారు. డబ్బులిచ్చే వరకూ అతని చుట్టూ వెళ్తూనే ఉంటారు. సరిగ్గా ఇదే సీన్ ఇప్పుడు మళ్ళీ రిపీటయ్యింది. ఇప్పుడు బ్రహ్మీ ప్లేస్ లో ఉంది ఎవరో తెలుసా. మన రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా.. భారీ వర్షాల కారణంగా ముంబై ఎయిర్ పోర్ట్‌లో చిక్కుకుంది రకుల్ ప్రీత్ సింగ్. దాని గురించే రకుల్ చాలా డిజప్పాయింట్ అయితే ఇప్పుడు మరో చేదు అనుభవం ఎదురైంది.
ముంబైలో కొందరు బిచ్చగాళ్ళు రకుల్ ను చుట్టిముట్టి తెగ ఏడిపించారు. ఆ సమయంలో రకుల్‌ను తాకారు వాళ్ళంతా. పోనీ అంత వెంట పడుతున్నారు కదా అని డబ్బులిచ్చిందా అంటే.. అదీ లేదు. ‘అంత డబ్బు సంపాదిస్తున్నావ్… వారికి కాస్త బిక్షం వేస్తే పోయేదేముంది’ అని కొందరు, బిచ్చగాళ్ళకు డబ్బులివ్వడమంటే వారిని బద్దకస్తులను చేయడమే’ అని మరికొందరు…. కామెంట్లు పెట్టి ఈ విషయాన్ని వైరల్ చేస్తూ వస్తున్నారు.
View this post on InstagramThe solid salad surprise 🙀 #rakulpreetsingh
A post shared by Viral Bhayani (@viralbhayani) on