బిగ్ బాస్ సెట్ లో రకుల్ హల్ చల్

టాలీవుడ్ నుంచి షార్ట్ బ్రేక్ తీసుకుంది స్టార్ హీరోయిన్ రకుల్. ఇప్పుడు ఆమె దృష్టంతా బాలీవుడ్ సినిమా ‘అయ్యారీ’ మీదే ఉంది. బాలీవుడ్లో రకుల్ నటిస్తున్న ఫస్ట్ బిగ్ మూవీ ఇదే. ఈ చిత్ర ప్రమోషన్ల కోసం ముంబయిలో దిగింది రకుల్. బాలీవుడ్ పెద్ద సినిమాల్ని సల్మాన్ ఖాన్ షో “బిగ్ బాస్”లో ప్రమోట్ చేయడం మామూలే. “అయ్యారీ” కోసం హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి రకుల్ కూడా ఈ షోకు వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆమె సదరాగా సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ “దబంగ్”లో చుల్ బుల్ పాండే అవతారం ఎత్తింది. నెత్తిన పోలీస్ టోపీ పెట్టుకుని.. లాఠీ పట్టుకుని చుల్ బుల్ పాండేను అనుకరించడం మొదలుపెట్టింది.

ఈ సందర్భంగా సల్మాన్ భుజం మీద చేయి వేసి అతడిని బెదిరించడం మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సరదాకే అయినా.. సల్మాన్ లాంటి సూపర్ స్టార్ భుజం మీద రకుల్ అలా చేయి వేసి నిలబడ్డ ఫొటో అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ షో అంతా రకుల్ ఇలాగే రచ్చ రచ్చ చేసింది.
ఆమె చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus