Allu Arjun,Rakul Preet: బన్నీకి జోడీగా మరో ఛాన్స్ కావాలంటున్న రకుల్.. ఛాన్స్ ఇస్తారా?

బన్నీ రకుల్ కాంబినేషన్ లో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన సరైనోడు సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. బన్నీ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో సినిమాకు సంబంధించి వార్తలు వైరల్ అయినా అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. ఈ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో సినిమా అయితే కచ్చితంగా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే బన్నీతో కలిసి మళ్లీ నటించాలని ఉందంటూ రకుల్ కామెంట్లు చేశారు.

ప్రస్తుతం తమిళంలో పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో రకుల్ (Rakul Preet) బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో మాత్రం కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని ఈ బ్యూటీ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సరైనోడు సినిమా విడుదలై ఏడేళ్లు పూర్తైన నేపథ్యంలో బన్నీ నాకు ఇష్టమైన కోస్టార్ అని రకుల్ చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ గొప్ప నటుడని ఇండస్ట్రీలోని అద్భుతమైన నటులలో బన్నీ ముందువరసలో ఉంటారని ఆమె చెప్పుకొచ్చారు.

బన్నీ, నేను మంచి ఫ్రెండ్స్ అని ఎప్పుడు కలిసినా సరదాగా ఉండటంతో పాటు ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకుంటూ ఉంటామని రకుల్ అన్నారు. సోషల్ మీడియాలోని ఫన్నీ ఇమేజ్ లను చూసి నవ్వుకుంటామని సరైనోడు మూవీ నుంచి మా బంధం ఇదే విధంగా ఉందని ఆమె అన్నారు. సరైనోడు సినిమాలోని తమ పాత్రలను ఆడియన్స్ ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారని రకుల్ చెప్పుకొచ్చారు. ఆడియన్స్ మా కాంబినేషన్ ను మళ్లీ చూడాలని అనుకుంటున్నారని ఆమె కామెంట్లు చేశారు.

మంచి కథ ఉంటే బన్నీతో కలిసి మరో సినిమాలో నటించడానికి సిద్ధమేనని రకుల్ అభిప్రాయపడ్డారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రెమ్యునరేషన్ కూడా పరిమితంగానే ఉంది. ఈ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం పలు వ్యాపారాలతో బిజీగా ఉన్నారు. ఇండియన్2 సినిమాతో పాటు పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న ఈ బ్యూటీ ఈ సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus