గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ‘పాన్ ఇండియా’ స్టార్ హీరో. ఈయన పక్కన హీరోయిన్ గా చేయాలని బాలీవుడ్ హీరోయిన్లు సైతం ఎగబడుతున్నారు. ఇక టాలీవుడ్ హీరోయిన్ల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతమంది హీరోయిన్లయితే ‘ప్రభాస్ సినిమాలో చిన్న క్యారెక్టర్ దొరికినా చాలు’ అనే కామెంట్స్ చేస్తున్నారని ఫిలింనగర్ టాక్. ఛాన్స్ వస్తే ప్రభాస్ పక్కన నటించడానికి ఏ హీరోయిన్ కూడా నో చెప్పదు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ప్రభాస్ సరసన నటించే అవకాశం వస్తే రిజెక్ట్ చేసిందంట.

ఆమె మరెవరో కాదు ‘మన్మధుడు2’ భామ రకుల్ ప్రీత్ సింగ్. ప్రభాస్ సూపర్ హిట్ సినిమా అయిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలో హీరోయిన్ గా మొదట ఈ భామనే సంప్రదించారట. అయితే ఆ సమయంలో రకుల్ కు సినిమాల పై అవగాహన లేదంట. అందులోనూ ‘మోడలింగ్’ లోనే రాణించాలనే ఉద్దేశం ఉండడంతో ప్రభాస్ సినిమాకి నో చెప్పినట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రకుల్ చెప్పుకొచ్చింది. అయితే విచిత్రంగా రకుల్ ప్రభాస్ కజిన్ అయిన సిద్దార్థ్ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘కెరటం’ సినిమాతోనే టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus