అక్కడ కూడా తెలుగు సినిమాల గురించే చెబుతున్నాను : రకుల్ ప్రీత్ సింగ్

తెలుగుతోపాటు తమిళ-హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ సౌత్ సూపర్ స్టార్ హీరోయిన్ గా మారిన రకుల్ ప్రీత్ సింగ్ నటించిన తాజా చిత్రం “జయ జానకి నాయక”. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 11న విడుదలకానుంది. సినిమా విడుదలను పురస్కరించుకొని రకుల్ మీడియాతో పంచుకొన్న విశేషాలు మీకోసం..!!

ఈ కాలంలో రావాల్సిన సినిమా కాదు..
ప్రెజంట్ జనరేషన్ లవ్ స్టోరీస్ కి భిన్నంగా ప్యూర్ ఎమోషన్ తో తెరకెక్కిన చిత్రం “జయ జానకి నాయక”. ప్రేమ కోసం ఓ యువకుడు ఎలాంటి కటినమైన అవరోధాలను సాహసంతో ఎదుర్కొన్నాడు? ఎంత ధైర్యంగా ముందుకుసాగాడు అనేది సినిమా థీమ్. అసలు బోయపాటి గారు కథ చెబుతున్నప్పుడు ఈ జనరేషన్ లో ఇలాంటి లవ్ స్టోరీస్ ఉన్నాయా, ఉంటే ఎంత బాగుండు అనిపించింది.

కేవలం డబ్బు కోసం చేసిన సినిమా కాదు..
స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న నేను బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి కారణం కథ నచ్చాడమే. బోయపాటిగారు కథ చెప్పినప్పుడే బాగా కనెక్ట్ అయిపోయాను. “సరైనోడు” రిలీజ్ టైమ్ లో ఈ కథ విన్నాను.

రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో..
ఇప్పటివరకూ చాలా చలాకీ, చిలిపి, రోమాంటిక్ రోల్స్ చేసిన నేను మొదటిసారిగా డీప్ ఎమోషన్ ఉన్న పాత్రలో నటించాను. సినిమాలో దాదాపుగా ఓ 20 నిమిషాలపాటు ఏడుస్తూనే ఉంటాను.

ఏదైనా సాయంత్రం వరకే..
సినిమా షూటింగ్ టైమ్ లో ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయినా, ఏడ్చినా అది పేకప్ చెప్పేవరకే. ఆ తర్వాత మళ్ళీ నా ప్రపంచం నాది. హ్యాపీగా కాఫీ షాప్ లకి వెళ్ళి ఎంజాయ్ చేస్తాను. పబ్లిక్ లో తిరగడానికి ఎక్కువ ఇబ్బందిపడను.

దేవుడి దయ వల్ల ఇప్పటివరకూ అలాంటి పరిస్థితి రాలేదు..
నేను చేసుకొన్న పుణ్యమో లేక నా తల్లిదండ్రుల ఆశీర్వాదమో తెలీదు కానీ.. ఇప్పటివరకూ “గ్లిజరిన్” పెట్టుకోకుండా ఎడ్వాల్సిన అవసరం ఏర్పడలేదు. కాకపోతే.. “జయ జానకి నాయక” కోసం ఎక్కువ ఏడ్చేసరికి ఎక్కడ డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయేమోనని భయపడ్డాను.

ఆ సినిమా చూసి నానీకి వెంటనే ఫోన్ చేశాను..
రీసెంట్ టైమ్స్ లో నేను చూసి బాగా ఎమోషనల్ అయిపోయిన సినిమా “నిన్ను కోరి”. సినిమా ఎండింగ్ వరకూ కూడా.. “ప్లీజ్ హీరో హీరోయిన్ కలవాలి” అని మనసులో అనుకుంటూనే ఉన్నాను. చివర్లో అయితే.. విపరీతంగా ఏడ్చేశాను. నా పక్కన మా తమ్ముడు టిష్యూస్ ఇస్తూ కూర్చున్నాడు. సినిమా అయిపోయాక నానీకి ఫోస్ చేసి అదే విషయం చెప్పాను.

బోయపాటి ది బెస్ట్..
ఇప్పటివరకూ నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ లో బోయపాటి ది బెస్ట్. ఆయనంత స్మార్ట్ డైరెక్టర్ ని నేను ఎక్కడా చూడలేదు. ఆ రోజు ఎలాంటి సీన్ తీస్తున్నారో సెట్ లోనూ అలాంటి వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకొనేవారు. అలాగే ఎలాంటి నటుడి నుంచైనా తనకు కావాల్సిన ఎక్స్ ప్రెషన్ ను రాబట్టుకొనేవారు.

బెల్లంకొండ శ్రీనివాస్ డెడికేషన్ నచ్చింది..
నేను బెల్లంకొండ శ్రీనివాస్ మునుపటి సినిమాలు చూడలేదు. అయితే.. తనని మొదటి రోజు సెట్స్ లో చూసినప్పటికీ.. చివరి రోజు చూసేసరికి చాలా తేడా కనిపించింది. ఒక నటుడిగా ఎంత ఇంప్రూవ్ అయ్యాడో.. వ్యక్తిత్వంగానూ అదే స్థాయిలో పరిణితి చెందాడు.

వాళ్ళని చూసి నేనెందుకు టెన్షన్ పడాలి..
ఇప్పుడొస్తున్న హీరోయిన్ల కారణంగా నాకు క్రేజ్ తగ్గుతోంది, ఆఫర్లు తగ్గుతున్నాయి అనే వార్తలు న్యూస్ పేపర్లలో, వెబ్ సైట్లలో చదువుతూనే ఉంటాను. అయితే.. వాటిని నేను సీరియస్ గా తీసుకొను. కొత్త టాలెంట్ రావడం అనేది సహజం, ఇక్కడ అందరికీ మంచి అవకాశాలున్నాయి. సో, ఒక హీరోయిన్ వచ్చింది, ఆ అమ్మాయికి క్రేజ్ ఉంది అని నేను టెన్షన్ పడాల్సిన అవసరం నాకు లేదు.

అక్కడ కూడా తెలుగు సినిమాల గురించే చెప్తున్నాను..
మొన్నటివరకూ లండన్ లో ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ లో ఉన్నాను. అక్కడ ఉన్నంతసేపు “మా హైద్రాబాద్ లో ఇలా తీస్తారు, అక్కడ షూటింగ్ అలా చేస్తారు” అంటూ ఎప్పుడూ మన తెలుగు సినిమాల గురించే చెప్పేదాన్ని.

ఫిదా సినిమా ఇంకా చూడలేదు..
లండన్ షెడ్యూల్ లో బిజీగా ఉండడం వల్ల ఫిదా సినిమా ఇంకా చూడలేదు. అందరూ సాయి పల్లవి అద్భుతంగా నటించిందని చెప్తుండడం ఆనందాన్నిస్తోంది. అలాంటి పాత్రలు తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తే భవిష్యత్ లో హీరోయిన్ల పాత్రల ఔన్నిత్యం పెరుగుతుందని నా భావన.

పవన్ కళ్యాణ్ తో సినిమా ఇంకా సైన్ చేయలేదు..
ప్రస్తుతం తెలుగులో స్పైడర్, తమిళంలో కార్తీతో ఒక సినిమా, సూర్యతో ఇంకో సినిమా సైన్ చేశాను. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంకా ఒకే చేయలేదు. ఆయనతో నటించాలని నాకూ ఉంది!

– ధీరజ్ బాబు 

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus