రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకున్నారని నేషనల్ మీడియా కోడై కూసింది. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణలో రియా చక్రవర్తి వెల్లడించినట్టు వరుస కథనాలు ప్రసారం చేసింది. రకుల్ సహా సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్, రణ్‌వీర్ స్నేహితురాలు సైమన్ ఖంబట్టా పేర్లు వాటిలో జోడించింది. ఎన్సీబీ ప్రతినిధి ఆ వార్తలను ఖండించారు. డ్రగ్ కేసులో తన పేరును ముడి పెడుతూ వార్తలు ప్రసారం చేయడంపై రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
డ్రగ్ కేసులో తనకు వ్యతిరేకంగా మీడియాలో వస్తున్న వార్తలను ఆపాలని ప్రసార మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో రకుల్ పిటీషన్ దాఖలు చేశారు. జస్టిస్ నవీన్ చావ్లా నేతృత్వంలోని సింగిల్ బెంచ్ విచారణ చేపట్టింది. రకుల్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని కేంద్రం, ప్రసార భారతి, ప్రెస్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు కోరింది. డ్రగ్ కేసులో రియా చక్రవర్తితో రకుల్ పేరు ముడి పెడుతూ వస్తున్న వార్తలపై ‘మీ వైఖరి ఏంటో చెప్పండి’ అని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు అడిగింది.
రకుల్ అభ్యర్థన పరిగణలోకి తీసుకుని మీడియా సంయనం పాటిస్తుందని ఆశిస్తున్నట్టు కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై నేషనల్ మీడియా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. రకుల్, సారా పేర్లు రియా చెప్పలేదని ఎన్సీబీ వెల్లడించిన తరవాత నేషనల్ మీడియా తీరుపై సినిమా సెలబ్రిటీలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సారీ రకుల్, సారీ సారా హ్యాష్ టాగ్స్ తో నిరసన తెలిపారు.
Most Recommended Video
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!