పుకార్లపై స్పందించిన రకుల్!

సినిమా ఇండస్ట్రీ పలు రకాల పుకార్లు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లపై రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి. వాటిలో నిజాల కంటే అబద్దాలే ఎక్కువగా ఉంటాయి. తాజాగా తనపై వస్తున్న ప్రచారానికి సంబంధించి టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఆ ప్రచారం ఏంటో..? రకుల్ ఏం చెప్పిందో తెలుసుకుందాం. అక్కినేని సమంత ‘ఆహా’ యాప్ లో సామ్ జామ్ షోని హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోకి ముఖ్య అతిథిగా వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ను సమంత ఇంటర్వ్యూ చేసింది.

దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఇందులో రకుల్ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. తనపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలపై ఎందుకు స్పందించరని సమంత.. రకుల్ ని ప్రశ్నించగా.. పుకార్లు పుట్టించేవారు ఎలాంటి ఆలోచన లేకుండా చేస్తుంటారని తెలిపింది. తను ఉంటున్న ఇల్లు కూడా ఎవరో గిఫ్ట్ గా ఇచ్చారనే ప్రచారం మీడియాలో సాగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పింది.

ఎవరో ఇల్లు ఇస్తే.. ఇక తానెందుకు కష్టపడి పని చేయాలని రకుల్ ప్రశ్నించింది. తనపై పుకార్లు రావడం ఇదే తొలిసారి కాదని.. అందుకే వాటిని పట్టించుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిపింది. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో ‘మే డే’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే తెలుగులో నితిన్ సరసన ‘చెక్’ సినిమాలో నటిస్తోంది.

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus