ఒక సినిమాలో నటించిన హీరోహీరోయిన్ల నడుమ అఫైర్ ఉందనే గాసిప్పులు రావడం సర్వసాధారణం. వాటిని సదరు హీరోహీరోయిన్లు మాత్రమే కాదు జనాలు కూడా పట్టించుకోవడం మానేసి చాలా కాలమైంది. అయితే.. కనీసం ఒక్క సినిమాలో కలిసి నటించని రకుల్ ప్రీత్-రానాల నడుమ ఏదో ఉందనే వార్తలు గత కొంతకాలంగా హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. అసలు ఇలాంటి వార్తలు ఎందుకు పుట్టుకొస్తున్నాయో అర్ధం కానీ సిట్యుయేషన్ లో రకుల్ ఉంటే రానా మాత్రం సదరు వార్తలను ఏమాత్రం ఖాతరు చేయకుండా తన సినిమాల షూటింగ్స్ లో బిజీ అయిపోయాడు.
అయితే.. సదరు గాసిప్పులు మరీ శృతి మించుతుండడంతో ఇటీవల తన తాజా బాలీవుడ్ మూవీ “అయ్యారీ” ప్రమోషన్స్ లో భాగంగా ముంబై మీడియాతో ముచ్చటించిన రకుల్ “రానాతో ఎఫైర్” వార్తలపై క్లారిటీ ఇచ్చింది. “నేను రానా మంచి స్నేహితులం మాత్రమే, నాకు ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే గుర్తొచ్చేది రానా మాత్రమే. అలాంటిది నాకు రానాకి ఎఫైర్ అనేది ఎందుకు క్రియేట్ అయ్యిందో ఇప్పటివరకూ అర్ధం కాలేదు. మేము కలిసి ఒక సినిమాలో నటించింది కూడా లేదు. కేవలం పార్టీస్ లో మాత్రమే కలుస్తుంటామ్. ఇకనైనా ఇలాంటి వార్తలు రాకుండా ఉంటే చాలు” అంటూ కాస్త ఘాటుగానే సమాధానమిచ్చింది. మరి రకుల్ చెప్పింది విని ఇకనైనా గాసిప్పు రాయుళ్ళు తమ జోరు తగ్గిస్తారో లేదో చూడాలి.