ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘మేరే హస్బెండ్ కి బివి’ అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సోషల్ మీడియాలో రకుల్ పలు అంశాలపై స్పందించి, తన ఫాలోవర్స్ తో కూడా ఇంటరాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల రకుల్ ని లింక్ ఓ పొలిటికల్ లీడర్ కి లింక్ చేస్తూ.. సోషల్ మీడియాలో కొంత ట్రోలింగ్ జరిగింది. ఈ అంశాలపై రకుల్ ఫ్రస్ట్రేట్ అయినట్టు టాక్ వినిపిస్తుంది.
ఇందులో భాగంగా ఆమె.. ‘దేశంలో పనికిమాలిన వాళ్ళు ఎక్కువైపోయారు.పనీపాట లేకపోవడం, ఫ్రీ డేటా అందుబాటులో ఉండటం వల్ల ఇతరులను ఇబ్బంది పెట్టి వేధించడమే కొంతమందికి పనిగా మారిపోయింది.వీళ్ళలానే పక్క వాళ్ళను కూడా చెడగొడుతున్నారు.సెలెబ్రెటీల పర్సనల్ వ్యవహారాల గురించి లేనిపోనివి ప్రచారం చేస్తూ వాళ్ళ జీవితాలను కూడా డిస్టర్బ్ చేస్తున్నారు’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఓ సెక్షన్ ఆఫ్ నెటిజెన్లపై మండిపడింది.
‘కెరటం’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రకుల్.. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ‘లౌక్యం’ ‘సరైనోడు’ ‘ధృవ’ వంటి హిట్ సినిమాల్లో నటించింది.అలాగే మహేష్ బాబు ‘స్పైడర్’, ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ వంటి పెద్ద సినిమాల్లో కూడా నటించింది. అయితే తర్వాత ఆమెను ప్లాపులు వెంటాడాయి. తర్వాత అవకాశాలు కూడా కరువవడంతో.. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. అయితే పెళ్ళికి ముందు రకుల్ సైన్ చేసిన కొన్ని సినిమాలు తర్వాత రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘అందులో ‘ఇండియన్ 2′ తో పాటు ‘మేరే హస్బెండ్ కి బివి’ కూడా ఒకటని చెప్పాలి.