చైతన్య నో చెప్పినా… నాగార్జున ఓకే చేసాడు..!

అక్కినేని నాగార్జున కెరీర్లో ‘ఆల్ టైం హిట్’ గా నిలిచిన ‘మ‌న్మ‌థుడు’ చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ‘చి ల సౌ’ చిత్రంతో డైరెక్టర్ గా మారాడు రాహుల్ రవీంద్రన్. ఆ చిత్రం కమర్షియల్ గా హిట్ కాకపోయినా… మంచి చిత్రం గా నిలిచింది. ఈ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రవీంద్రన్. ఇప్పుడు నాగార్జునతో ‘మన్మధుడు2’ వంటి క్రేజీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటి వరకూ ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా ర‌కుల్ ప్రీత్ సింగ్‌ ను ఖరారు చేశారట. మొదటిసారి ర‌కుల్‌.. నాగ్‌తో జ‌త‌క‌ట్టబోతోంది. ఇక రకుల్ ఎంట్రీతో ఈ చిత్రానికి మరింత క్రేజ్ ఏర్పడుతుంది అనడంలో సందేహం లేదు. ఇటీవల ‘వెంకీ మామ’ చిత్రంలో నాగచైతన్య సరసన మొదట రకుల్ ని హీరోయిన్ గా అనుకున్నారు… కానీ ఇప్పుడు ‘మన్మధుడు 2’ లో జాయిన్ అయ్యింది రకుల్. కొడుకు సినిమాకి ‘నో’ చెప్పి తండ్రి చిత్రానికి ‘ఎస్’ చెప్పింది అంటూ సోషల్ మీడియాలో అప్పుడే కామెంట్లు కూడా పెట్టేస్తున్నారు.. నెటిజెన్లు. ఇక ఈ చిత్రానికి ‘ఆర్.ఎక్స్100’ ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందించబోతున్నాడు. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్ పై స్వయంగా నాగార్జునే ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. మార్చి 12న లాంఛనంగా మొదలు కానుందట. మొదటి షెడ్యూల్ ను పోర్చుగ‌ల్‌లో జరుపడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఎక్కువ శాతం చిత్రీక‌ర‌ణ యూర‌ప్‌లోనే జ‌ర‌ప‌బోతున్నారట. ఈ చిత్రం అఖిల్, నాగ చైతన్య, సమంత గెస్ట్ రోల్ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus