భార్యగా నటించబోతున్న రకుల్ ప్రీత్ సింగ్!

దువ్వాడ జగన్నాథం తర్వాత హరీష్ శంకర్ “దాగుడుమూతలు” సినిమాని తెరకెక్కించబోతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో నితిన్‌, శ‌ర్వానంద్ హీరోలుగా ఫిక్స్ అయ్యారు. మే నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఇందులో ఇద్దరు బ్యూటీలు హీరోయిన్ గా నటించనున్నారు. ఒక హీరోయిన్ గా ఫిదా బ్యూటీ సాయి పల్లవిని నటించమని హరీష్ కోరగా ఆమె మొహమాటం లేకుండా నో చెప్పింది. ఆ పాత్రను చేయడానికి రకుల్ ప్రీత్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్టు ఫిలిం నగర్ వర్గాలు తెలిపాయి. ఆమె నితిన్ కి జోడీగా నటిస్తున్నట్లు తెలిసింది.

అయితే రకుల్ పోషించే రోల్ నితిన్ గర్ల్ ఫ్రెండ్ కాదని, అతని భార్యగా నటించబోతున్నట్లు టాక్. 2017 లో హ్యాట్రిక్ హిట్ అందుకున్న ఈ బ్యూటీకి 2018 కలిసి రాలేదు. అంతమాత్రానా? హౌస్ వైఫ్ పాత్ర కి ఒకే చెప్పాలా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ రోల్ కి మంచి ఇంపార్టెన్స్ ఉందని.. అందుకే రకుల్ అంగీకరించినట్లు ఆమె సన్నిహితులు వెల్లడించారు. ఈ పాత్ర ఆమెకి మరింత పేరు తీసుకొస్తుందని భావిస్తున్నారు. ఇక శర్వానంద్ జోడీగా నటించడానికి ఏ బ్యూటీ ఓకే చెబుతుందో చూడాలి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus