Rakul Preet Wedding: ఆ ప్రశ్నలకు క్లారిటీ ఇవ్వబోతున్న రకుల్!

కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ స్టేటస్ ను అందుకున్నారు. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రార్థన పాత్రను రకుల్ అద్భుతంగా పోషించారు. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లను అందిపుచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే ఈ నెల 10వ తేదీన పుట్టినరోజు సందర్భంగా రకుల్ ప్రముఖ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నానని వెల్లడించారు.

అధికారికంగా ప్రేమలో ఉన్న విషయాన్ని రకుల్ బయటపెట్టడంతో త్వరలోనే రకుల్ పెళ్లి జరగనుందని వార్తలు వస్తున్నాయి. పెళ్లి గురించి రకుల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా త్వరలోనే ఆమె నుంచి ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం రకుల్ చేతిలో బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కొండపొలం సినిమాతో రకుల్ ఖాతాలో ఫ్లాప్ చేరిన సంగతి తెలిసిందే. త్వరలో రకుల్ పెళ్లి చేసుకోబోతుందని నిర్మాతలకు ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేయాలని కోరారని తెలుస్తోంది.

మరి కొందరు నిర్మాతలను షూటింగ్ వాయిదా వేయాలని రకుల్ సూచించినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రకుల్ చేతిలో ఉన్న సినిమాల షూటింగ్ ఈ ఏడాది చివరినాటికి పూర్తి కానుందని తెలుస్తోంది. రకుల్ ప్రేమించిన వ్యక్తి ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన వషు భగ్నానీ కొడుకు కాగా బెల్ బాటమ్, కూలీ నంబర్ 1, జవానీ జానెమాన్ సినిమాలకు జానీ భగ్నానీ నిర్మాతగా పని చేశారు. రకుల్ పెళ్లి ఎప్పుడో తెలియాలంటే ఆమె అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus