రకుల్ ప్రీత్ సింగ్ పంజాబీ అమ్మాయే అయినా మూవీల్లోకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం టాలీవుడ్ ద్వారానే. దాదాపుగా తెలుగులో అగ్ర కథానాయకులందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది రకుల్. ‘సరైనోడు’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’లాంటి బ్లాక్‌బస్టర్లతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది రకుల్.
అయితే రీసెంట్ గా దే దే ప్యార్ దే 2 మూవీ చిట్‌చాట్‌లో భాగంగా సిధ్ధార్థ్ కన్నన్‌తో తెలుగు హీరోలపై తన మనసులో మాటను షేర్ చేసుకుంది ఈ బ్యూటీ. సౌత్ టాప్ స్టార్లు రామ్ చరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ల గురించి ఇంట్రస్టింగ్ పాయింట్స్ షేర్ చేసింది.
“జూనియర్ ఎన్టీఆర్ అంటే సహజమైన యాక్టింగ్ అని, డ్యాన్స్ విషయానికొస్తే… అతని దగ్గర రిహార్సల్ అనే మాటే ఉండదు. ఒక్కసారి స్టెప్ చూపిస్తే చాలు… చూసి సింగిల్ టేక్ లో చేసే టాలెంట్ అతని సొంతం అని ” అంటూ చెప్పిన రకుల్, ఐకాన్ స్టార్ గురించి మాట్లాడుతూ – “అల్లు అర్జున్‌కి ఎప్పటినుంచో ఒక విజన్… తాను ఒక స్టార్, కానీ తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి ఎలా తీసుకెళ్లాలి?” అనే పెద్ద తపన ఉంటుంది అని చెప్పుకొచ్చింది.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే – “చరణ్ ఎనర్జీ పూర్తిగా చైల్డ్‌లాంటి ఫన్ వైబ్స్. స్టార్ అయినా కూడా తనలో ఉన్న ఆ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటాడు” అని రకుల్ చెప్పింది.
సూపర్‌స్టార్ మహేష్ బాబు గురించి ఆమె – “మహేష్ బాబులో ప్రత్యేకత అంటే ఆయన తన కుటుంబంతో ఉండే విధానం. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ను అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తాడు” అంటూ టాలీవుడ్ హీరోలపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.
ఇక రకుల్ నెక్ట్స్ ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ‘పతి పత్నీ ఔర్ వో దో’లో కనిపించబోతోంది. ముదసర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఎంటర్టైనర్‌లో సారా అలీ ఖాన్, వామికా కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా 2026 మార్చి 4న థియేటర్లలో రిలీజ్ కానుంది.