టాలీవుడ్ లో ప్రస్తుతం జయపజయలతో సంబంధం లేకుండా సినిమాలను చేస్తోన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అమ్మడు మొన్నటి వరకు విజయాలను బాగానే అందుకుంది గాని ఇటీవల స్పైడర్ సినిమా డిజాస్టర్ అయినప్పటి నుండి మాత్రం రకుల్ కెరీర్ క్లోజ్ అయ్యింది అనేట్టు కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే రకుల్ మాత్రం అపజయాలను చాలా ఈజీగా తీసుకుంటోంది. తనకు ఇష్టమైన క్యారెక్టర్స్ ని చేస్తూ స్టార్ హీరోయిన్ అనే బిరుదును ఇంకా పెంచుకోవాలని చూస్తోంది. కోలీవుడ్ లో కార్తీ తో నటించిన ఖాకి సినిమా మంచి హిట్ అవ్వడంతో అక్కడి ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఇక రీసెంట్ గా అమ్మడు మొదటి సారి JFW (జస్ట్ ఫర్ వుమెన్) మ్యాగజైన్ కి ఫొటో షూట్ ఇచ్చింది. బ్రైడల్ స్పెషల్ స్టిల్స్ లో రకుల్ అందాలతో చాలా కవ్వించేసింది.
కూల్ గా కనిపిస్తూ కళ్లతోనే ఎదో మాయ చేసేస్తోంది. ఇక డ్రెస్ లు కూడా చాలా అందంగా ఉన్నాయి. రకుల్ ని ఇంత అందంగా ఎప్పుడు చూడలేదని ఇప్పటికే చాలా మంది నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి డ్రెస్ లో సరికొత్త పెళ్లి కూతురిగా కనిపించిందని చెబుతున్నారు. ముఖ్యంగా కవర్ పేజ్ పై ఉన్న స్టిల్ ని చూస్తే ఎవ్వరైనా అమ్మడికి ఫిదా అవ్వాల్సిందే. ఇక రకుల్ బాలీవుడ్ లో అయారి సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా వుంది. ఇక జనవరి 26న ఆ మూవీ రిలీజ్ కానుంది. అలాగే కోలీవుడ్ లో సూర్యా – సెల్వ రాఘవన్ ప్రాజెక్టులో కూడా రకుల్ కథానాయికగా కనిపించనుంది.