కొత్త అలవాటు నేర్పించినందుకు ఉపాసనకు థాంక్స్ చెప్పిన రామ్ చరణ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రంగస్థలం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ యాక్షన్ చిత్రం చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ నిర్మాత దానయ్య భావిస్తున్నారు. అందుకే చెర్రీ ఈ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా అతన్ని ఓ జాతీయ మీడియా కలిసి ఇంటర్వ్యూ చేసింది. అందులో రామ్ చరణ్ ఆసక్తికర సంగతులు వెల్లడించారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ పై తీసిన సంజు సినిమాపై ప్రశంసలు గుప్పించారు. “నాకు బయోపిక్ సినిమాలంటే చాలా ఇష్టం. బయోపిక్ లలో నిజాలు ఉంటాయి. అందుకే అవి నచ్చుతాయి. అయితే, బయోపిక్ లో నటించే అవకాశం నాకు వస్తే… ఎంతవరకు న్యాయం చేయగలుగుతానో మాత్రం చెప్పలేను.

“సంజు” సినిమాలో రణబీర్ కపూర్ నటన చాలా బాగుంది. ఆయన గొప్ప యాక్టర్”  అని అభినందనలు కురిపించారు. అలాగే వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. “నా భార్య ఉపాసనకు కామెడీ సినిమాలంటే చాలా ఇష్టం. ఆమె వల్లే నేను కామెడీ సినిమాలు చూస్తున్నాను. ఈ విషయంలో ఆమెకు ధన్యవాదాలు” అని చరణ్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి యాక్షన్ సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో పూర్తిగా కామెడీ ఉండే సినిమాలు చేశారు. అటువంటి కథల్లో చెర్రీ ని చూడాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. మరి వారి కోరికని చరణ్ ఎప్పుడు తీరుస్తాడో.. చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus