Ram Charan: ఇంట్లో స్టార్లు ఉండటంపై చరణ్‌ కామెంట్స్‌!

మెగా ఫ్యామిలీలో హీరోలు ఎంతమంది అంటే… లెక్కపెట్టడానికి చేతికున్న పదివేళ్లూ సరిపోతాయి. అంతమంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు. అందులో ఒకరిద్దరు తప్ప, మిగిలినవారంతా తమదైన శైలిలో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అయితే ఇంతమంది హీరోలు ఒకే కుటుంబంలో ఉండటం ప్రేక్షకులకు, అభిమానులకు ఆనందం కలిగిస్తోందేమో కానీ… మెగా కుటుంబంలో మాత్రం చిన్నపాటి కన్‌ఫ్యూజన్‌ను క్రియేట్‌ చేస్తోంది అంటున్నాడు రామ్‌చరణ్‌. అదేంటో ఇటీవల ఆయన చెప్పాడు కూడా. ఆ మాటలు వింటే మీకు కూడా అవును కదా అనిపిస్తుంది.

‘ఆర్‌ఆర్ఆర్‌’ సినిమా ప్రచారం కోసం రామ్‌చరణ్‌, ఎన్టీఆర్, రాజమౌళి ఇటీవల ముంబయిని చుట్టేశారు. బాలీవుడ్‌ టీవీ షోలకు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో కపిల్ శర్మ షోకి కూడా వెళ్లారు. అక్కడ కపిల్‌ తనదైన శైలిలో వెరైటీ ప్రశ్నలు వేసి అదరొగొట్టాడు. ఈ క్రమంలోనే చరణ్ కుటుంబంలో ఉన్న హీరోల గురించి అక్కడ చర్చ వచ్చింది. ఇంట్లో ఇంతమంది హీరోలు ఉంటారు కదా… అందరూ ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడు… బయటి నుండి సెక్యూరిటీ గార్డ్‌ వచ్చి… మీ కోసం ఎవరో అభిమాని వచ్చారు అని చెబితే మీ ఫీలింగేంటి అని అడిగాడు.

అంటే… ఎవరి కోసం ఆ అభిమాని వచ్చాడు అని అనుకుంటారా? అంటూ కపిల్‌ ఆ ప్రశ్నకు ఇంకొంచెం వివరంగా అడిగాడు. దానికి చరణ్‌… ఆ విషయమేమో కానీ ఎవరైనా ఫిలింమేకర్‌ వచ్చినప్పుడు మాత్రం మేం కన్‌ఫ్యూజ్‌ అవుతామని చెప్పాడు. అతను తీసుకొచ్చిన సినిమాను ఎవరితో చేయాలి అనుకుంటున్నాడో తెలియక తికమక పడతామని చెప్పుకొచ్చాడు చరణ్‌. అవును మరి అంతమంది హీరోలు ఒకే కుటుంబంలో ఉంటే ఇలాంటివి తప్పవు మరి. దానికితోడు మెగా హీరోల కథలు చిరంజీవి కచ్చితంగా వింటారని ఓ టాక్ కూడా.

‘‘విమాన వ్యాపారం, హాస్పిటల్స్‌, హోటల్స్‌ చైన్‌… ఇలా చాలా వ్యాపారాల్లో ఉన్న మీకు సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది అంటారా?’’ అంటూ కపిల్‌ మరో ప్రశ్న వేశాడు. దానికి చరణ్‌ చెప్పిన సమాధానానికి అక్కడున్నవాళ్లు ఫిదా అయిపోయారు. ‘‘ఆ వ్యాపారాలు చేస్తే… ఈ షోకి రాలేను కదా. సినిమాలు చేస్తేనే వస్తాను’’ అంటూ కపిల్‌కి స్వీట్‌ కౌంటర్‌ ఇచ్చడు చరణ్‌. చూద్దాం కొత్త సంవత్సరం నాడు ఈ ఎపిసోడ్‌ టెలీకాస్ట్‌ అవుతుంది. అందులో ఇంకెన్ని జోకులు పేలుతాయో.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus