ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రెండు పక్కలా వాడి ఉన్న కత్తి లాంటిది. మంచికి వాడుకుంటే మంచే జరుగుతుంది, చెడు కోసం వాడుకుంటే చెడే జరుగుతుంది అని. అయితే సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు చెడే చేసింది. అయితే మంచికి వాడితే ఎలా ఉంటుంది అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం ఈ వీడియో అని చెప్పాలి. ‘పెద్ది’ (Peddi) సినిమాకు సంబంధించి ఇటీవల రిలీజ్ డేట్ గ్లింప్స్ వచ్చింది చూసే ఉంటారు. అందులో డైలాగ్ భలే ఉంది కూడా. ఆ డైలాగే ఇప్పుడు ఏఐ ద్వారా వచ్చింది.
అందులో ఏఐ ఏముంది.. చరణే డబ్బింగ్ చెప్పాడు కదా ఆ గ్లింప్స్‌ని అంటారా? అయితే ఆ డైలాగ్ చరణ్ (Ram Charan) బయట ఇంటర్వ్యూలో కూర్చుని మాట్లాడినట్లుగా చెబితే.. సూపర్ ఉంటుంది కదా. అదే చేశారు ఇప్పుడు ఏఐతో. చూడటానికి అచ్చంగా చరణ్ చెప్పినట్లు అనిపించినా ఇది ఏఐ జనరేటడ్ వీడియో. చరణ్ ఏదో మనతో మాట్లాడుతూ చెప్పినట్లుగా ఉంటుంది మరి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’.
జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ చేయబోతున్నారు. చరణ్ పుట్టిన రోజు గిఫ్ట్‌గా రామ్‌చరణ్ విశ్వరూపం చూడొచ్చన్నమాట. ఈ విషయాన్ని చెబుతూనే ఇటీవల సినిమా నుండి రిలీజ్ డేట్ గ్లింప్ష్ ఇచ్చారు. అందులో రామ్‌చరణ్ ఉత్తరాంధ్ర యాసలో డైలాగు చెప్పాడు. ‘ఒకే పని సెసేనాకి… ఒకే నాగ బతికేనాకి… ఇంతపెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసెయ్యాలా… పుడతామా యేటి మళ్లీ! సెప్మీ’ ఆ డైలాగ్.
ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) స్వరాలు అందిస్తున్నారు. క్రీడా నేపథ్యంలో సాగే కథ ఇది. అయితే ఏదో ఒక క్రీడ కాదని.. ఇందులో ఎవరు డబ్బులు ఇస్తే, ఏ ఆట ఆడటానికి ఇస్తే ఆ ఆట ఆడి ఆ జట్టును గెలిపించే ఆట కూలీ అని చెబుతున్నారు. మరి అసలు సంగతేంటో తేలాలి వచ్చే పుట్టిన రోజు రావాల్సిందే.
AI Mass #PEDDI pic.twitter.com/KOK3QOzAUW
— Mr© (@CharanTheLEO) April 8, 2025