Ram Charan: ఇక్కడ అయిపోయింది రాజధానికి రెడీ అవుతున్న చరణ్‌ అండ్‌ కో.!

చాలా రోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్న రామ్‌చరణ్‌ (Ram Charan) కొత్త సినిమా కొత్త షెడ్యూల్‌ రీసెంట్‌గా హైదరాబాద్‌లో స్టార్ట్‌ అయింది. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ చిన్న డౌట్‌ కూడా కలిగింది. టీమ్‌ దానికి క్లారిటీ కూడా ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు మరో గుడ్‌ న్యూస్‌ వచ్చింది. ఈ సినిమా మరో షెడ్యూల్‌ ఢిల్లీలో ప్రారంభం కాబోతోంది. వచ్చే నెల మొదట్లో సినిమా టీమ్‌ దేశ రాజధానికి వెళ్లి కీలక షెడ్యూల్‌ చిత్రీకరణ జరిపి వస్తారట. అక్కడ ఓ పెద్ద మైదానంలో ఈ షెడ్యూల్‌ ఉంటుంది అంటున్నారు.

Ram Charan

రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)  హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ‘పెద్ది’ (RC 16 Movie)  అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. కుస్తీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కీలకమైన పోటీ సన్నివేశాలను ఇప్పుడు తెరకెక్కించబోతున్నారట. దీని కోసమే రామ్ చరణ్‌ – బుచ్చిబాబు ఢిల్లీ వెళ్లబోతున్నారట. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతోపాటు, పోటీ సన్నివేశాలు చిత్రీకరిస్తారని చెబుతున్నారు.

హైదరాబాద్‌లో తాజాగా ఈ సినిమా కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. రామ్ చరణ్‌ – దివ్యేందుపై క్రికెట్‌ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారట. సినిమాలో క్రికెట్, కుస్తీతో పాటు మరికొన్ని ఆటలకు ప్రాధాన్యముందట. ఏ ఆటా తక్కువ కాదు, దేనినీ కించపరచొద్దు అనే యాంగిల్‌లో సినిమా ఉండబోతోందట. ఇక ఈ సినిమాలో చరణ్‌ ఆశ్చర్యపరిచే కొత్త క్యారెక్టరైజేషన్‌లో కనిపించనున్నాడట. తన గురువు సుకుమార్‌  (Sukumar)  లాగే బుచ్చిబాబు రామ్‌చరణ్‌ పాత్రకు ఓ డిఫెక్ట్‌ పెట్టారు అని అంటున్నారు.

ఇక ఈ సినిమాకు ‘పెద్ది’ అనే పేరుతో పాటు మరో రెండు టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నాయని సమాచారం. మార్చి 27న రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్‌ టీజర్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఆ రోజు మొత్తం క్లారిటీ వస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పటివరకు తీసిన సన్నివేశాల్లోంచి బెస్ట్‌ గ్లింప్స్‌ రెడీ చేయాలని బుచ్చిబాబు భావిస్తున్నారట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus