Ram Charan, Jr NTR: జక్కన్నపై కోపంగా ఉన్న హీరోల ఫ్యాన్స్?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ రిలీజ్ కాగా జక్కన్న ఇందులో రాజమౌళి ఊహించని స్థాయిలో విజువల్స్ తో ట్రీట్ ఇచ్చారు. గ్లింప్స్ తో హీరోల కంటే జక్కన్నకే ఎక్కువ ప్రశంసలు దక్కుతున్నాయి. సూపర్ షాట్స్ తో రాజమౌళి సినిమాపై అంచనాలను ఊహించని స్థాయిలో పెంచుతున్నారు. స్టార్ హీరోల అభిమానులు గ్లింప్స్ లోని తమ ఫేవరెట్ హీరోల షాట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

గ్లింప్స్ లో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడంతో స్టార్ హీరోల ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. అయితే సినిమా రిలీజైన తర్వాత మాత్రం చరణ్, తారక్ లకు పాన్ ఇండియా లెవెల్ లో ఖచ్చితంగా పేరు వస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగిందనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అలియా భట్ నటించడంతో బాలీవుడ్ లో ఈ సినిమాకు భారీస్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

ఆర్ఆర్ఆర్ తో రాజమౌళి ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తారో చూడాల్సి ఉంది. ఓవర్సీస్ లో ఈ సినిమాను రికార్డు స్థాయిలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే రాజమౌళి దేశంలోనే నంబర్1 డైరెక్టర్ అని అనిపించుకుంటారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఈ సినిమా తర్వాత మహేష్ జక్కన్న కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus