Ram Charan, Upasana: క్లిన్ కారాతో విదేశాలకు వెళ్లిన ఉపాసన దంపతులు!

రామ్ చరణ్ ఉపాసన దంపతులు పెళ్లి చేసుకున్నటువంటి 11 సంవత్సరాలకు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఈ దంపతులకు ఈ ఏడాది జూన్ 20వ తేదీ పండంటి ఆడబిడ్డ జన్మించిన విషయం మనకు తెలిసిందే. ఇలా రాంచరణ్ ఉపాసన దంపతులు పెళ్లి అయిన 11 సంవత్సరాలకు తల్లిదండ్రులుగా మారిపోయారు. ఈ చిన్నారికి క్లీన్ కారా అని నామకరణం కూడా చేశారు. అయితే ఈమె జన్మించే ఐదు నెలలు అవుతున్నప్పటికీ ఇంకా తన ఫేస్ ఎలా ఉంటుందనే విషయాన్ని మాత్రం ఎక్కడా బయట పెట్టలేదు.

ఇలా తమ చిన్నారి ఫేస్ కనపడకుండా రామ్ చరణ్ ఉపాసన దంపతులు జాగ్రత్త పడుతున్నారు. అయితే కూతురు జన్మించిన తర్వాత రామ్ చరణ్ ఉపాసన మొదటిసారి తమ కూతురితో కలిసి వెకేషన్ వెళ్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ లో వీరికి సంబంధించినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాప జన్మించిన తర్వాత ఒక వివాహం నిమిత్తం రామ్ చరణ్ ఉపాసన దంపతులు పారిస్ వెళ్లి వచ్చారు కానీ చిన్నారిని మాత్రం వెంట తీసుకెళ్లలేదు.

మొదటిసారి తమ కూతురితో కలిసి ఈ దంపతులు ఫారెన్ వెకేషన్ వెళ్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ వీరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఇందులో రామ్ చరణ్ తన పెట్ రైమ్ నీ తీసుకువెళ్తుండగా ఉపాసన తన కుమార్తెను ఎత్తుకున్నారు అయితే ఇక్కడ కూడా ఉపాసన తన కుమార్తె ఫేస్ కనపడకుండా ఫేస్ కు చేతిని అడ్డంగా పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్నటువంటి గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ లో కాస్త విరామం దొరకడంతోనే ఇలా తన భార్య కూతురితో కలిసి రామ్ చరణ్ ఇటలీ వెకేషన్ కి వెళ్ళారని తెలుస్తుంది. ఇటలీ వెకేషన్ లో భాగంగా ఎక్కువ రోజులు పాటు ఇక్కడే ఉండనున్నారట వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలు అన్నింటిని పూర్తిచేసుకుని తిరిగి ఇండియాకి రాబోతున్నారని తెలుస్తోంది. ఇండియా వచ్చిన తర్వాత చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఆ వెంటనే బుచ్చిబాబు దర్శకత్వంలో ప్రారంభం కాబోతున్నటువంటి సినిమా పనులలో బిజీ కానున్నారని తెలుస్తోంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus