Ram Charan, Upasana: చరణ్ ఉపాసనలకు అయోధ్య ఆహ్వానం!

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాలు జనవరి 22వ తేదీ ఎంతో ఘనంగా జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. జనవరి 22వ తేదీ రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు క్రీడ రంగానికి చెందిన ప్రముఖులందరూ కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే రామమందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.

ఇకపోతే ఈ రామ మందిరం ఏర్పాటు కార్యక్రమానికి ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి పలువురు ఆహ్వానం అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రామ మందిరం ట్రస్ట్ నిర్వాహకులు రామ్ చరణ్ ఉపాసన దంపతులను కలిసి వారికి ఆహ్వానం అందజేశారు. రామ మందిర ట్రస్ట్ నిర్వాహకులు శుక్రవారం రామ్ చరణ్ ఉపాసనని కలిసి వారికి రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ వేడుకకు ఉపాసన రాంచరణ్ (Ram Charan) కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి అలాగే పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందినట్టు తెలుస్తుంది. ఇక చిరంజీవి కూడా కుటుంబ సమేతంగా అయోధ్య వెళ్తున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే.

ఇక రాంచరణ్ సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా పూర్తి కాగానే ఈయన ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్షన్లో బిజీ కానున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus