Ram Charan and Upasana: క్లిన్ కారాతో ముంబై మహాలక్ష్మి ఆలయంలో చరణ్ దంపతులు!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ దంపతులు ముంబై మహాలక్ష్మి ఆలయంలో సందడి చేశారు. ఇటీవల తన కూతురితో కలిసి ఉపాసన కూడా ముంబై వెళ్లారు. ఇలా రాంచరణ్ ఉపాసన దంపతులు గత కొద్దిరోజులుగా ముంబైలోనే ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. ఉపాసన కుమార్తె క్లిన్ కారాకు సరిగ్గా ఆరు నెలలు పూర్తి కావడంతో ఈ దంపతులు తమ చిన్నారితో కలిసి ముంబైలోని మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయించారు. ఉపాసన పెళ్లైన 11 సంవత్సరాలకు తల్లిగా మారిన సంగతి మనకు తెలిసిందే.

ఈమె జూన్ 20వ తేదీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇలా చిన్నారి పుట్టి నేటికీ సరిగ్గా ఆరు నెలలు కావడంతో ఈ దంపతులు తమ చిన్నారి పేరు మీద ప్రత్యేకంగా మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా రామ్ చరణ్ స్టాప్ తో పాటు క్లీన్ కారాను చూసుకుని నాని కూడా ఉన్నారు.

ఆలయంలో అర్చకులు ప్రత్యేకంగా పూజలు చేశారు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఉపాసన రాంచరణ్ ఆలయం నుంచి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు చుట్టుముట్టి సెల్ఫీలు దిగడానికి ప్రయత్నాలు చేశారు. ఇక ఈ చిన్నారి జన్మించి ఆరు నెలలు పూర్తి అయిన ఇప్పటివరకు చిన్నారి ఎలా ఉంది అనే విషయాలను మాత్రం ఉపాసన తెలియజేయలేదు.

ఇక నేడు మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్నప్పటికీ (Upasana) ఉపాసన తన చిన్నారి ఫేస్ కనపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా దాదాపు 80 శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus