Ram Charan , Buchi Babu: స్టార్టింగ్‌ తేలలేదు కానీ.. టైటిల్‌ క్లారిటీ ఇచ్చేస్తున్నారు.. బుచ్చిబాబు అదీ చెప్పేస్తే!

రామ్‌చరణ్‌ (Ram Charan)  ఫ్యాన్స్‌కి ఇటీవల దర్శకుడు శంకర్‌  (Shankar)గుడ్‌ న్యూస్‌ చెప్పారు. చరణ్‌ పాత్ర షూటింగ్‌ అయిపోయిందని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు ఇంకో గుడ్‌ న్యూస్‌ కోసం ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. అదే కొత్త సినిమా కబురును ఎప్పుడు ఇస్తారని. ఆ సినిమానే బుచ్చిబాబు (Buchi Babu)   దర్శకత్వంలో రూపొందబోయే ‘ఆర్సీ 16’  (RC16/Peddi) . చాలా నెలల క్రితమే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ అయినా.. ఇంకా స్టార్ట్‌ చేయలేదు. ఈ విషయంలో క్లారిటీ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి నిరాశ ఎదురవుతూనే ఉంది.

అయితే సినిమా టైటిల్‌ మీద వస్తున్న ‘కొత్త’ పుకార్లపై ఇన్‌డైరెక్ట్‌ క్లారిటీ వచ్చింది. దీంతో షూటింగ్‌ స్టార్టింగ్‌ అప్‌డేట్‌ కూడా ఇచ్చేయొచ్చు కదా అని సినిమా టీమ్‌ను అడుగుతున్నారు. RC 16 అనేది సినిమా వర్కింగ్ టైటిల్ అని అందరికీ తెలిసిందే. నిజానికి ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ ఖరారు చేశారనే ఇప్పటికే వార్తలొచ్చాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే సినిమాకు ఆ టైటిల్ అయితే సూట్ అవుతుందని అన్నారు కూడా. అయితే ఇటీవల ఆ సినిమా పేరు మారుస్తున్నారనే వార్తలొచ్చాయి.

కానీ సినిమా టీమ్‌ క్లోజ్‌ వ్యక్తుల నుండి అయితే టైటిల్‌ మార్పు లేదని క్లారిటీ ఇస్తున్నారు. అంతేకాదు ప్రీ ప్రొడక్షన్‌ పనులు, కాస్టింగ్‌ పనులు తుది దశకు వచ్చాయని చెబుతున్నారు. ఈ లెక్కన ఈ నెలలోనే షూటింగ్‌ అప్‌డేట్ వస్తుంది అని అంచనా వేస్తున్నారు. చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) సంగీత దర్శకుడు.

ఇప్పటికే పాట రికార్డింగ్‌ అయిపోయింది అని టాక్‌. సినిమా కోసం స్పెషల్‌ సెట్‌ వేస్తున్నారట. అందులో తొలి షెడ్యూల్‌ ఉంటుంది అని చెబుతున్నారు. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా మొదలైతే ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)  వచ్చే సమయంలో కూడా బుచ్చిబాబు సినిమా గురించి మరికొన్ని వివరాలు తెలియొచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus