‘ఉప్పెన’ (Uppena) సినిమాతో తొలి ప్రయత్నంలో భారీ విజయం అందుకున్నారు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) . టిపికల్ కథను కన్విన్సింగ్గా తీసి అదిరిపోయే వసూళ్లు కూడా అందుకున్నారు. అయితే రెండో సినిమా ప్రారంభించడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. తొలుత కథను ఓ హీరోకి చెప్పి ఒప్పించినా.. ఆ తర్వాత నో అనిపించుకున్నారు. ఇప్పుడు రామ్‌చరణ్‌తో (Ram Charan) అదే కథను సినిమాగా చేస్తున్నారు. ఆ సినిమా ఈ రోజు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం చర్చకు వస్తోంది. అదే గ్యాప్.
అవును, బుచ్చిబాబు సినిమా వచ్చి చాలా కాలమైంది. అంటే ఆయన తొలి సినిమా విడుదలకు, రెండో సినిమా ప్రారంభానికి మధ్య 1379 రోజుల గ్యాప్ ఉంది. ఇక సినిమా షూటింగ్ ఆఖరుకు, ఇప్పుడు ప్రారంభానికి చూసుకుంటే 1600 రోజుల గ్యాప్ ఉంది అని చెప్పొచ్చు. దీంతో ఇన్ని రోజుల గ్యాప్‌తో రెండో సినిమా చేస్తున్న దర్శకుడు బుచ్చిబాబే కావొచ్చు అని ఓ చర్చ నడుస్తోంది. ఏదైతేముంది బుచ్చిబాబు కల ఎట్టకేలకు నిజమైంది.
ఇక సినిమా సంగతి చూస్తే.. శుక్రవారం ఉదయం మైసూర్‌లోని చాముండేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు బుచ్చిబాబు. ఈ మేరకు చేతిలో స్క్రిప్ట్ పేపర్లతో ఆలయ ప్రాంగణం వద్ద దిగిన ఓ ఫొటోని ఎక్స్ (మాజీ ట్విటర్)లో షేర్ చేశారు బుచ్చిబాబు. ఈరోజు తమకు బిగ్ డే అని పేర్కొన్నారు. ఎంతోకాలం నుండి ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. అమ్మవారి ఆశీస్సులతో సినిమా మొదలైంది అని రాసుకొచ్చారు ఆయన.
మైసూర్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో మూడు రోజుల పాటు సినిమా షూటింగ్ ఉంటుంది అని సమాచారం. రామ్‌చరణ్ (Ram Charan) , ఇతర ముఖ్య పాత్రధారుల మీద కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారని టాక్. గ్రామీణ నేపథ్యంలోని స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనున్న కథతో ఈ సినిమా సిద్ధం కానున్నట్లు ఇప్పటికే సమాచారం వచ్చింది. సినిమాకు ‘పెద్ది’ (RC16) అనే పేరు కూడా పరిశీలిస్తున్నట్లు గతంలో పుకార్లు వచ్చాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) సంగీతం అందిస్తున్నారు.
It’s a BIG DAY….
The most awaited moment
Started with the blessings of Chamundeshwari Matha, MysoreBlessings needed #RC16 pic.twitter.com/fPnEgZRxeT
— BuchiBabuSana (@BuchiBabuSana) November 22, 2024