మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) తో నిరాశపరిచాడు. అంతకు ముందు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) కలిసి చేసిన ‘ఆచార్య’ (Acharya) కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. హిట్స్, ప్లాప్స్ ఎలా ఉన్నా.. ఈ సినిమాల వల్ల రాంచరణ్ ప్రైమ్ టైం వేస్ట్ అయిపోయింది. కాబట్టి.. ఇప్పుడు ఫుల్ ఫోకస్ అంతా ఒక్క సినిమాపైనే పెట్టాడు. అదే బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సినిమాపై అని చెప్పాలి. వెంకట్ సతీష్ కిలారు (Venkatesh Kilaru) నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘మైత్రి’ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇందులో హీరోయిన్. ముందుగా జాన్వీని ఈ సినిమా కోసమే లాక్ చేశారు. కానీ ‘గేమ్ ఛేంజర్’ వల్ల ఈ ప్రాజెక్టు లేట్ అవ్వడంతో ‘దేవర’ (Devara) ముందుగా వచ్చింది. ఇదిలా ఉండగా.. బుచ్చిబాబు సినిమాని చరణ్ బాగా నమ్మాడు. కచ్చితంగా ఈ సినిమాతో తనకు నేషనల్ అవార్డు వస్తుందని భావిస్తున్నాడు. మెగా అభిమానులు ముఖ్యంగా చరణ్ అభిమానులు కూడా బుచ్చిబాబు సినిమాపై నమ్మకం పెట్టుకున్నారు.
దీనికి ‘పెద్ది’ (RC 16 Movie) అనే టైటిల్ పరిశీలనలో ఉంది. రాంచరణ్ పుట్టినరోజు అయిన మార్చి 27న టైటిల్ తో కలిపి ఓ పోస్టర్ వదిలే అవకాశం ఉంది. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్ తో ఆ పోస్టర్ రాబోతోంది అనేది ఇన్సైడ్ న్యూస్. అందుతున్న సమాచారం ప్రకారం.. రాంచరణ్- బుచ్చిబాబు..ల సినిమా 2026 మార్చి 26న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటిస్తారట. అంటే నెక్స్ట్ చరణ్ బర్త్ డేకి ఒక్కరోజు ముందు అనమాట.నిజమైతే ఇది అభిమానులకు డబుల్ ట్రీట్ లాంటిది.
ఎందుకంటే సాధారణంగా స్టార్ హీరోల బర్త్ డేలకి రీ రిలీజ్ సినిమాలు వస్తున్న రోజులివి. అలాంటిది అభిమాన హీరో పుట్టినరోజు టైంలో.. అతని సినిమా కూడా వస్తుంది అంటే వారికి కావాల్సింది ఏముంటుంది చెప్పండి. అలాగే ఇంటర్వెల్ పరీక్షలు వంటివి కూడా ఆ టైంకి కంప్లీట్ అయిపోతాయి. సో ఎలా చూసుకున్నా అది మంచి డేట్ అనే చెప్పాలి. చరణ్ ‘రంగస్థలం'(Rangasthalam) ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) సినిమాలు కూడా ఇదే టైంలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోశాయి.