Mahesh Babu, Sitara: మహేష్‌ – సితార కొత్త యాడ్‌.. శ్రీలీల ఏమన్నా డబ్బింగ్‌ చెప్పిందా?

మహేష్‌బాబుకు (Mahesh Babu) వయసు పెరిగే కొద్దీ యంగ్‌గా అవుతున్నాడు అని అభిమానులు అంటూ ఉంటారు. ఆయన్ను చూస్తే అదే మాట అనిపిస్తుంది కూడా. ఒకవేళ ఇప్పటికీ ఈ మాట మీకు అనిపించకపోతే ఆయన కొత్త యాడ్‌ ఒకటి వచ్చింది చూడండి మీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఓ దుస్తుల దుకాణానికి మహేష్‌బాబు  తన తనయ సితారతో కలసి ఓ యాడ్‌ చేశాడు. ఆ వీడియో ఇటీవల రిలీజ్‌ అయింది. అది చూశాక చాలామంది నోట వస్తున్న ఒకే ఒక మాట ఇద్దరూ అన్నాచెల్లెళ్లలా ఉన్నారు కదా.

Mahesh Babu, Sitara:

వినడానికి ఇది అతిశయోక్తిగా అనిపిస్తుంది కానీ.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరినీ చూస్తుంటే కచ్చితంగా అలానే ఉంది. దుస్తులకు సంబంధించి, ఫ్యాషన్‌కు సంబంధించి ఆ యాడ్‌లో మహేష్‌, సితార మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఒకానొక సమయంలో తండ్రిని మించిపోయే యాటిట్యూడ్‌, గ్రేస్‌, ఛార్మింగ్‌తో సితార వీడియోలో అదరగొట్టింది అని చెప్పాలి. ఇక గ్లామర్‌ సంగతి మాట్లాడుకోవాలా చెప్పండి ఇద్దరూ అదరగొట్టారు అని చెప్పాలి.

ఈ చర్చతోపాటు మరో రెండు డిస్కషన్లు కూడా మొదలయ్యాయి. ఒకటి యాడ్‌లో సితార గొంతు. అచ్చంగా శ్రీలీలలా (Sreeleela) ఉంది అని కొందరు అంటుంటే.. కాదు కాదు శ్రీలీలనే డబ్బింగ్‌ చెప్పింది అని మరికొందరు అంటున్నారు. ఈ విషయంలో క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక మరో డిస్కషన్‌ సితారను ఎప్పుడు హీరోయిన్‌ చేస్తున్నారు అని. అప్పుడే హీరోయిన్‌ ఏంటి అనొచ్చు.. ఇప్పుడు ప్రయత్నాలు స్టార్ట్‌ చేస్తేనే కదా.

ఇక ఈ సమయంలో మరో విషయం కూడా డిస్కస్‌ చేయాలి. అదే రీసెంట్‌గా వచ్చిన ఓ వాదన. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) వారసుడు అకీరా నందన్‌ హీరోగా ఎంట్రీ ఇస్తే.. హీరోయిన్‌గా సితారనే నటించాలి అని ఆ మధ్య అభిమానులు చర్చించుకున్నారు. పవన్‌ – మహేష్‌ (Mahesh Babu) ఈ దిశగా ఏమన్నా ఆలోచిస్తారేమో చూడాలి. అదే జరిగితే ఆ పవర్‌ – సూపర్‌ కాంబినేషన్‌ చూడటానికి రెండు కళ్లూ చాలవు.

‘ఎల్‌ 2’.. కీలక పాత్రలో స్టార్‌ హీరో సోదరి.. తొలిసారి సౌత్‌కి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus