Ram Charan: మరో వ్యాపారంలోకి రామ్ చరణ్ ఎంట్రీ.. సూపర్ ప్లాన్ అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ఒకవైపు హీరోగా కెరీర్ ను కొనసాగిస్తుండగా మరోవైపు వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే పలు వ్యాపారాలలో చరణ్ పెట్టుబడులు పెట్టి భారీ మొత్తంలో లాభాలను సొంతం చేసుకున్నారు. చరణ్ తన స్నేహితునితో కలిసి కొత్త బ్యానర్ ను మొదలుపెడుతున్నారని తెలుస్తోంది. హీరో రామ్ చరణ్, యువి సంస్థ విక్కీ మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. చరణ్ కు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలలో విక్కీ తన వంతు సలహాలు, సూచనలు ఇచ్చేవారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

(Ram Charan) చరణ్, విక్కీ కలిసి వి మెగా పిక్చర్స్ అనే కొత్త బ్యానర్ ను మొదలుపెట్టారు. అఖిల్ తర్వాత మూవీ ఈ బ్యానర్ పై తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని సమాచారం. ఈ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. తన పేరును బ్రాండ్ గా మార్చుకున్న రామ్ చరణ్ కు ఈ ఏడాది కలిసిరావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరోవైపు పుష్ప2, దేవర సినిమాల రిలీజ్ డేట్లను బట్టి గేమ్ ఛేంజర్ డేట్ ను ఫిక్స్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నారు. గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ అవుతుందని ఈ సినిమా అభిమానులు అప్పటివరకు వేచి చూడక తప్పదని బోగట్టా. ఎగ్జిబిటర్ సెక్టార్ లో ఇప్పటికే చరణ్, విక్కీ కలిసి పలు వ్యాపారాలు చేస్తున్నారు. రామ్ చరణ్ అటు కెరీర్ పరంగా ఇటు వ్యక్తిగత జీవితంలో అంతకంతకూ ఎదుగుతున్నారు.

ఉపాసన త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. చరణ్ పారితోషికంతో పాటు సక్సెస్ రేట్ పెరుగుతోంది. రామ్ చరణ్ తండ్రిని మించిన తనయుడిగా ఎదిగారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇతర హీరోల అభిమానులను సైతం తన మాటలతో ఆకట్టుకుంటూ కెరీర్ పరంగా సంచలన విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus