Klin Kaara: మెగా మనవరాలి ఆయాకి అన్ని లక్షలు జీతం ఇస్తున్నారా?

‘అతడు’ (Athadu) సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో ఓ సీన్ ఉంటుంది. ప్రభాస్ రాజ్ (Prakash Raj) పాత్ర నిందితుడైన హీరో కోసం అన్వేషిస్తున్న టైంలో జైల్లో ఉంటున్న సాదు(రాహుల్ దేవ్) (Rahul Dev) వద్దకి వెళ్తాడు. అతను చెప్పిన వివరాలను బట్టి హీరోని పట్టుకోవాలనుకుంటాడు. అదే టైంలో శివారెడ్డి (షియాజీ షిండే) (Sayaji Shinde) మర్డర్ కేస్ కోసం ఆరా తీయగా.. ఆ హత్య ప్రొఫెషనల్ చేశాడు అని చెబుతాడు. సాధారణంగా ప్రొఫెషనల్స్ ఇలాంటి వాటికి ఎంత తీసుకుంటారు అని సాదుని అడగ్గా..!

Klin Kaara

అతను 2 ,3 కోట్లు తీసుకుంటారు అని చెబుతాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ పాత్ర ఓ డైలాగ్ చెబుతుంది. ‘ఉద్యోగం మానేసి ఇలాంటిది ఏదో ఒకటి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది కదా’ అని..! ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం కూడా అలాంటి డైలాగ్ నే గుర్తుచేస్తుంది. అంతలా ఏంటి ఆ విషయం అనుకుంటున్నారా.. ఓ ‘ఆయా’ జీతం రూ.2 లక్షలు కావడం. అవును హైదరాబాద్ వంటి నగరాల్లో జాబులు చేసే చాలామంది లక్ష రూపాయల జీతం కోసం 9 ,10 గంటలు పనిచేస్తూ ఉంటారు.

ఆ లక్షల్లో కూడా 30 శాతం వరకు టాక్స్ పోతుంటుంది. అయితే రాంచరణ్ (Ram Charan) – ఉపాసన..ల కూతురు క్లీంకారా (Klin Kaara) ఆయాకి ఏకంగా రూ.2 లక్షల జీవితం అందుకుంటున్నారట. ఆమె మరెవరో కాదు ప్రముఖ కేర్ టేకర్ అయినటువంటి లలితా డిసిల్వా. మెగా ఫ్యామిలీ ఈమెకు జీవితం ఇవ్వడం మాత్రమే కాదు.. ఓ ఫ్యామిలీ మెంబర్లా కూడా చూసుకుంటారట.

 వారం థియేటర్/ ఓటీటీల్లో.. రిలీజ్ కానున్న 17 సినిమాల లిస్ట్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus